ITRaids: 'పుష్ప 2' షూటింగ్ కి ఆటంకం కలుగుతుందా...
ABN, First Publish Date - 2023-04-20T13:57:21+05:30
'పుష్ప 2' నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఆఫీస్ లోనూ ఐటి దాడులు జరుగుతున్న కారణంగా 'పుష్ప 2' సినిమా షూటింగ్ కొంచెం డిలే అవొచ్చు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది
నిన్న ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీస్ (Mythri Movies) ఆఫీస్ మీద, అలాగే దర్శకుడు సుకుమార్ (Sukumar) ఇంట్లోనూ ఐటి రైడ్స్ (IT Raids) జరుగుతున్నాయన్న వార్త తెలుగు సినిమా పరిశ్రమని (TFI) ఒక్క కుదుపు కుదిపేసింది. మైత్రి మూవీస్ ఆఫీస్ మీద ఇదేమి మొదటి సారి కాదు, ఇంతకు ముందు కూడా ఇలాగే రైడ్స్ జరిగాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న 'పుష్ప 2' (Pushpa 2) సినిమా నిర్మాణం చేస్తున్నది, మైత్రీ మూవీస్, దానికి దర్శకుడు సుకుమార్.
ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే విశాఖపట్నం (Visakhapatnam) లో ఒక పెద్ద పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించుకొని యూనిట్ తిరిగి హైదరాబాద్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో షూటింగ్ మొదలెట్టాలని అనుకున్న సమయానికి ఇదిగో ఈ ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. ఇవాళ రెండో రోజు కూడా ఈ రైడ్స్ జరుగుతున్నాయి అని తెలుస్తోంది.
మరి దీని వలన 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ కి ఏమైనా అంతరాయం కలగవచ్చా అంటే ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాత, దర్శకుడు ఐటి అధికారులకి లెక్కలు చెప్పే పనిలో వున్నారు అని తెలిసింది. ఈ సమయంలో వాళ్ళు ఆదేశాలు లేకుండా ఎటువంటి షూటింగ్ జరగకపోవచ్చు. అందుకని మళ్ళీ వాళ్ళు ఈ రైడ్స్ అయ్యాక తేరుకొని అప్పుడు కొత్త షెడ్యూల్ వేస్తె అప్పుడు షూటింగ్ మొదలెట్టవచ్చు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
ఈమధ్య కాలం లో చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. సంక్రాంతికి చిరంజీవి (Chiranjeevi) తో తీసిన 'వాల్తేరు వీరయ్య' #WaltairVeerayya కి బాగా ప్రాఫిట్స్ వచ్చాయని అందరికీ తెలిసిన విషయమే. అలాగే బాలకృష్ణ నటించిన (Nandamuri Balakrishna) 'వీరసింహా రెడ్డి' (Veerasimha Reddy) కూడా విజయం సాధించింది అని అన్నారు. ఇప్పుడు రాబోయే 'పుష్ప 2' కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాకి కూడా జీ5 (Zee5) వాళ్ళు 950 కోట్ల రూపాయలకి ఆఫర్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ బేస్ చేసుకొని రైడ్స్ అవుతున్నాయేమో అని టాక్ నడుస్తోంది. అందువల్ల ఈ ప్రభావం 'పుష్ప 2' షూటింగ్ కి అంతరాయం ఉండొచ్చేమో అని కూడా అంటున్నారు.