Ileana D'Cruz: బాయ్ ఫ్రెండ్ హింట్ ఇచ్చింది!
ABN, First Publish Date - 2023-06-02T19:39:57+05:30
ఇలియానా త్వరలో తల్లి కాబోతుంది. ఆమె గర్భం దాల్చిన విషయాన్ని బేబీ బంప్ ఫొటోలతో ఏప్రిల్‌లో వెల్లడించింది. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో ఆడ బిడ్డే అని క్లారిటీ ఇచ్చింది.
ఇలియానా (Ileana D'Cruz) త్వరలో తల్లి కాబోతుంది. ఆమె గర్భం దాల్చిన విషయాన్ని బేబీ బంప్ ఫొటోలతో ఏప్రిల్‌లో వెల్లడించింది. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో ఆడ బిడ్డే అని క్లారిటీ ఇచ్చింది. అయితే తన గర్భానికి కారణమైన వ్యక్తి ఎవరనేది మాత్రం ఇలియానా బయటకు చెప్పడం లేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు కనిపిస్తోంది. తన పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే తన అజ్ఞాత ప్రేమికుడిని (Ileana D'Cruz boy friend) కొంచెం కొంచెంగా పరిచయం చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా అతని అరచేయిలో తన చేయి వేస్తూ దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టాటస్‌లో షేర్ చేసింది ఇల్లీబేబీ.
‘‘మనకు ఇష్టమైన వ్యక్తిని ప్రశాంతంగా తిననివ్వకూడదు, నా దృష్టిలో ఇదే రొమాన్స్ అంటే’’ అంటూ పోస్ట్ పెట్టింది. ఇలియానా పోస్టుతో ఆ వ్యక్తి ఎవరనే ఉత్కంఠ మరింత పెరిగింది. తన బాయ్ ఫ్రెండ్‌ను దశలవారీగా పరిచయం చేస్తే ఒకేసారి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భర్త ఎవరనే విషయాన్ని బయటపెడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరి చేతికి ఉన్న ఉంగరాలు చూసి ఎంగేజ్‌మెంట్ అయిందేమో అని చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్స్ .