Director Teja: స్టార్ ని బట్టి సినిమాకి వెళితే అసలు పెద్ద స్టార్స్ కి అపజయాలే రాకూడదు కదా
ABN, First Publish Date - 2023-06-01T12:34:50+05:30
‘అహింస’ సినిమాతో రామానాయుడు మనవడు దగ్గుబాటి అభిరామ్ ని పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ ఆ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరం విశేషాలు చెప్పాడు.
డైరెక్టర్ తేజ (Director Teja) తన సినిమాలతో ఎక్కువ కొత్తవారిని చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తూ వస్తున్నారు. మొదటి సినిమా 'చిత్రం' నుండి అతను ఈ వారం విడుదల అవబోయే 'అహింస' #Ahimsa సినిమా వరకు అలానే చేశారు. ఈ 'అహింస' సినిమాలో కూడా రామానాయుడు (Ramanaidu) మనవడు అభిరామ్ (AbhiramDaggubati) ని పరిచయం చేస్తుండగా, కథానాయికగా గీతికా తివారీ (GeetikaTiwari) ని కూడా పరిచయం చేస్తున్నాడు. అలాగే చాలామంది కొత్తవాళ్లు ఇందులో కనపడతారు.
అభిరామ్ పరిచయం గురించి చెపుతూ, సినీ నేపథ్యంలో వున్న పెద్ద కుటుంబాలలోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి అని చెప్పాడు తేజ. ప్రతిది భూతద్దం పెట్టి చూస్తారు, అలాగే కొత్తవారిలో బెరుకు, భయాలు సహజంగా ఉంటాయి. కానీ ఇతను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి అతనిలో ఇంకా ఎక్కువగా చూస్తారు. ఇప్పటికే స్టార్స్ అయిన వెంకటేష్ (Venkatesh), రానాలతో (RanaDaggubati) అభిరామ్ ని కూడా పోలిక పెట్టి చూస్తారని, అందువలన వారందరినీ దాటి ముందుకు రావడం కొంచెం కష్టం అయిన పని అని చెప్పాడు తేజ.
ఇలా చిత్ర పరిశ్రమలో సెటిల్ అయిన కుటుంబం నుండి వచ్చిన వాళ్ళతో చేస్తే, ప్రేక్షకుల అటెంక్షన్ ఉంటుంది కదా అన్నప్పుడు,
ఏమి ఉండదు అని అంటాడు తేజ. ప్రేక్షకులు చాలా తెలివైన వారు, ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా, వద్దా అని డిసైడ్ అయిపోతారు. ఒకవేళ స్టార్ ని బట్టి వెళితే అసలు పెద్ద స్టార్స్ కి ఈరోజు అపజయాలే రాకూడదు కదా అని ప్రశ్నించాడు తేజ. సినిమాలో ఎమోషన్ వుంటే ట్రైలర్ కి వస్తుందని, ప్రేక్షకులు ఆ ఎమోషన్ కి కనెక్ట్ ఐతే స్టార్ సినిమా లేక కొత్తవారిదా అనే తేడా లేకుండా చూస్తారు. ఒక్కసారి ఎమోషన్ కనెక్ట్ అయిందా ఎవరి సినిమా అయినా ఆపలేం అని చెప్పాడు తేజ.
అభిరామ్ ని పరిచయం చేయడనికి కారణం, తేజ ఇంతకు ముందు రామానాయుడు గారికి మాట ఇచ్చాడని, ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే సినిమా చేసాను అని చెప్పాడు.
తేజ తన గురించి చెపుతూ ఒకప్పుడు ఫుట్ పాత్ మీద వుండేవాడిని, ఆలా ఓ కెమెరామెన్ దగ్గర డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పని చేస్తూ ఉంటే, అతని పని తేజ కి ఆ కెమెరామేన్ బ్రేక్ ఇచ్చారుట. ఆలా నాలా చాలా మంది వున్నారు పరిశ్రమకి ఎలా రావాలో తెలియక. అలంటి వాళ్ళకి నేను బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను, ఇస్తాను కూడా. నేను అందుకే కొత్తవారితోటె సినిమాలు చేస్తాను, అది మారదు అని చెప్తున్నాడు తేజ. పెద్ద స్టార్ తో చేసిన, అందులో కొత్తవారికి అవకాశం ఇస్తాడట.