I Bomma : మీ యాక్షన్‌కు.. నా రియాక్షన్ దారుణంగా ఉంటుంది!
ABN, First Publish Date - 2023-09-07T12:12:08+05:30
కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీనికి పట్టి పీడిస్తూ, సినిమా పాలిట పెనుభూతంలా మారింది పైరసీ. సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీ చేసి ఆయా సైట్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదొక మాఫియాలా తయారైంది. ఏడాది మొత్తంలో వేల కోట్లు దీని వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతోంది.
కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీనికి పట్టి పీడిస్తూ, సినిమా పాలిట (piracy) పెనుభూతంలా మారింది పైరసీ. సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీ చేసి ఆయా సైట్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదొక మాఫియాలా తయారైంది. ఏడాది మొత్తంలో వేల కోట్లు దీని వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతోంది. పైరసీకి అడ్డుకట్ట వేయడానికి ‘యాంటిపైరసీ సెల్‌ను పెట్టినా దానికి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పైరసీని ఏమాత్రం అరికట్టలేకపోయారు. లీగల్‌గా ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇంటర్‌నెట్ ప్రపంచంలో ఒక్క దొంగను కూడా పట్టుకోలేకపోయారు. మూవీరూల్జ్, తమిళ్ రాకర్స్, ఫిల్మీ వ్యాప్... వంటి సైట్స్ నిర్మాతల కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. వీటిని దేనిని అడ్డుకోవడం నిర్మాతల వల్ల కాక ఇక ప్రేక్షకులనే పైరసీని ఎంకరేజ్ చేయవద్దు... క్వాలిటీ సినిమా కావాలంటే థియేటర్‌లోనే చూడండి’ అని ప్రేక్షకులనే వేడుకున్నారు. ఓటీటీ ఫామ్‌లోకి రావడంతో కొత్త సినిమాలు కొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ర్టీమింగ్ కావడంతో కాస్త పైరసీ ప్రింట్స్ చూడటం తగ్గించారు ప్రేక్షకులు. (I bomma warning to TFI)
అవన్నీ పక్కన పెడితే మరో పెద్ద భూతంలా తయారైన ‘ఐ బొమ్మ’ మాత్రం నిర్మాతలను మరింత భయపెడుతోంది. హెచ్ డీ క్వాలిటీలో ఎలాంటి సినిమాను అయినా ఇందులో చూడొచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పైగా ఈ ప్రాసెస్ అంతా ఫ్రీ. థియేటర్‌లో విడుదలైన ప్రతి బొమ్మ ఐబొమ్మలో దొరుకుతుంది. అయితే ఇదంతా ఖర్చు లేని పని కేవలం డేటా ఉంటే చాలు.
తాజాగా ‘ఐ బొమ్మ’ లాంటి బయటకు కనిపించని ఓ సంస్థ ఏకంగా నిర్మాతలకు షాక్ ఇచ్చింది. పలు హెచ్చరికలు జారీ చేసింది. ‘మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది’ అంటూ వార్నింగ్ ఇస్తూ ఓ నోట్ రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోట్ అతిపెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఆ నోట్‌ను నిజంగానే ఆ సంస్థ విడుదల చేసిందా లేక గిట్టనివారు ఎవరైనా ఆ పేరుతో ఇలా చేసారా’ అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఓ పైరసీ సైట్ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చే ధైర్యం చేసిందంటే తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అంటున్నారు. ఇది పరిశ్రమ మనుగడకే సవాల్ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఐ బొమ్మ పేరుతో విడుదల చేసిన నోట్‌లో ఏముందంటే..
1. ఐ బొమ్మ మీద ఫోకస్ చేస్తే.. మేం ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్ అమ్మిన వెంటనే.. మీకు ఏమి పట్టనట్లు కెమెరా ప్రింట్స్ తీసినవాళ్లపై కాకుండా ఓటీటీ రెవెన్యూ కోసం మాపై ఫోకస్ పెడుతున్నారు.
చిత్ర పరిశ్రమకు మాకు జరిగే యుద్థంలో విజయ్ దేవరకొండ మాదిరి మరో హీరో బలికావడం ఇష్టం లేదు(ఖుషి సినిమా విడుదలైన గంటలోనే పైరసీ ప్రింట్ విడుదల చేశారు) ముందు ఐబొమ్మ మీద కాకుండా కెమెరా ప్రింట్స్ విడుదల చేస్తున్న పైరసీ సైట్స్ పై ఫోకస్ పెట్టండి. చావుకు భయపడనివాడు దేనికీ భయపడడు’ అని హెచ్చరించింది.