National Film Awards: ఇది 2021 సంవత్సరానికి అన్నారు కదా, మరి 'ఆర్ఆర్ఆర్' కి ఎలా వచ్చాయి అవార్డులు
ABN, First Publish Date - 2023-08-25T16:52:03+05:30
69వ జాతీయ సినిమా పురస్కారాలను ప్రకటించేశారు, తెలుగు సినిమా పతాకం రెప రెప లాడింది. అన్నిటితో పాటు రాజమౌళి దర్శకత్వం చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఆరు అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా మర్చి 2022 లో విడుదలైంది కదా, మరి 2021 అవార్డులకు ఎలా ఎంపికైంది అని చాలామందికి సందేహం, అదెలా అంటే...
నిన్న అంటే ఆగస్టు 24వ తేదీన 69వ జాతీయ సినిమా పురస్కారాలు #NationalFilmAwards ప్రకటించారు. ఈసారి తెలుగు సినిమా పతాకం రెప రెపలాడింది. #NationalAwards ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (AlluArjun) కి దక్కింది, అతను చేసిన 'పుష్ప' #Pushpa సినిమాలో పుష్పరాజ్ #PushpaRaj పాత్రకి గాను. అలాగే అదే 'పుష్ప' సినిమాకి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ (DeviSriPrasad) కి కూడా అవార్డు దక్కింది.
దర్శకుడు బుచ్చిబాబు సానా (BuchibabuSana) మొదటిసారిగా దర్శకత్వం వహించిన 'ఉప్పెన' #Uppena సినిమా బెస్ట్ తెలుగు సినిమాగా ఎంపికైంది. ఇందులో వైష్ణవ తేజ్ (VaishnavTej), నేహా శెట్టి (NehaShetty) ఇద్దరూ జంటగా నటించారు, ఆ ఇద్దరికీ దర్శకుడితో పాటు ఇదే మొదటి సినిమా. మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) నిర్మాతలు. అలాగే పాటల రచయిత చంద్రబోస్ (Chandrabose) 'కొండపొలం' #KondaPolam సినిమాలో పాటకి గాను అవార్డు దక్కించుకున్నాడు. ఈ సినిమాకి క్రిష్ (DirectorKrish) దర్శకుడు, అలాగే ఇందులో కూడా వైష్ణవ తేజ్ కథానాయకుడిగా నటించాడు.
ఇదిలా ఉంటే, రాజమౌళి (SSRajamouli) దర్శకత్వం వహించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' #RRR కి ఆరు అవార్డులు వచ్చాయి. అందులో కీరవాణికి (MMKeeravani) నేపధ్య సంగీతానికి, అతని కుమారుడు కాలభైరవ (KalaBhairava) కి నేపధ్య గాయకుడూ, స్టంట్ మెన్ సోలమన్, కొరియోగ్రాఫర్ ప్రేక్ రక్షిత్ (PremRakshith), అలాగే మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే సినిమాగా కూడా 'ఆర్ఆర్ఆర్' ఎంపికయింది. అయితే ఇక్కడ చాలామందికి చాలా సందేహాలు వున్నాయి, అదేమంటే ఈ అవార్డులు 2021 సంవత్సరానికి గాను ఇచ్చినవి, ఇందులో జనవరి 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు వున్న సినిమాలని కదా తీసుకున్నారు, మరి 'ఆర్ఆర్ఆర్' మార్చి 2022 లో కదా విడుదలైంది, ఆ సినిమాని ఎలా తీసుకున్నారు అని.
అయితే ఆ ప్రశ్నకి జ్యూరీ కూడా నిన్న సమాధానం చెప్పింది. 2021 సంవత్సరంలో సెన్సార్ అయిన సినిమాలని అన్నీమేము తీసుకున్నాం, అంతే కానీ ఆది ఎప్పుడు విడుదలయ్యాయి అన్నవి ప్రాతిపదిక కాదు అని చెప్పేసారు జ్యూరీ మెంబెర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' నవంబర్ 26, 2021 లో సెన్సార్ కార్క్యక్రమాలు పూర్తి చేసుకొని సర్టిఫికెట్ కూడా తెచ్చేసుకుంది. #69thNationalFilmAwards అయితే సినిమా మాత్రం ఎదో గ్రాఫిక్స్ వర్క్ వుంది అని 2022 మార్చిలో విడుదల చేశారు. #NationalFilmAwards అందుకని 'ఆర్ఆర్ఆర్' సినిమా అన్ని విధాలా ఈ 2021 అవార్డులకు అర్హత సంపాదించింది అనటంలో ఎట్టి సందేహం లేదు. ఆ సెన్సార్ సర్టిఫికెట్ కూడా వుంది, చూసుకోవచ్చు.