సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

HCA Awards - Ramcharan: రామ్‌చరణ్‌కు హాలీవుడ్‌ స్టార్‌ క్షమాపణ.. ఏం జరిగిందంటే!

ABN, First Publish Date - 2023-02-25T13:59:11+05:30

కాలిఫోర్నియాలో జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డు (Hollywood Critics Association Awards 2023)వేడుక వేదికపై అమెరికన్‌ నటి టిగ్‌ నొటారో (Tig Notaro Sorry to charan) రామ్‌ చరణ్‌కు క్షమాపణ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియాలో జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డు (Hollywood Critics Association Awards 2023)వేడుక వేదికపై అమెరికన్‌ నటి టిగ్‌ నొటారో (Tig Notaro Sorry to charan) రామ్‌ చరణ్‌కు క్షమాపణ చెప్పారు. ఈ కార్యక్రమానికి టిగ్‌ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఓ కేటగిరీ అవార్డ్‌ ప్రధానం చేయడానికి రామ్‌చరణ్‌ను వేదికపై పిలిచే క్రమంలో చరణ్‌ అని పలకడం రాక తడబడ్డారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ సూపర్‌స్టార్‌ రామ్‌..’ అంటూ చరణ్‌ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అన్నారు. తదుపరి స్టేజ్‌ వెనుక ఉన్న బృందం సాయంతో చరణ్‌ అని కష్టంగా పలికారు. రామ్‌చరణ్‌(ram charan) చిరునవ్వుతో వేదికపైకి వెళ్లారు. ఆ వెంటనే రామ్‌చరణ్‌ వద్దకు వెళ్లి క్షమాపణ తెలియజేశారు టిగ్‌ నొటారో. అనంతరం హాలీవుడ్‌ నటి యాంజలీ భీమానికి (anajali bhimani) బెస్ట్‌ వాయిస్‌, మోషన్‌ క్యాప్చర్‌ అవార్డును చరణ్‌ అందించారు.

ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆరవ ఎడిషన్‌ అవార్డు వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఐదు కేటగిరిలో అవార్డులు దక్కాయి. బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ స్టంట్స్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ స్పాట్‌లైట్‌ విభాగాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ రాజమౌళి (SS Rajamouli)టీమ్‌ అయిదు అవార్డులు అందుకొని అంతర్జాతీయ వేదికపై విజయకేతనం ఎగురవేశారు.

Updated Date - 2023-02-25T13:59:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!