సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hara Om Hara: షేర్ దర్శకత్వంలో సినిమా.. హీరో సుమన్ సపోర్ట్

ABN, First Publish Date - 2023-07-01T20:22:24+05:30

కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హర ఓం హర’. షేర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టైటిల్ ‌లోగోని సీనియర్ హీరో సుమన్ ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Hara Om Hara Title Logo Launch Event
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం ‘హర ఓం హర’ (Hara Om Hara). కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షేర్ (Share) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తున్నారు. షేర్ దర్శకత్వంతో పాటు ఇందులో ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర టైటిల్ లోగోను సీనియర్ హీరో సుమన్ (Suman) చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు. (Hara Om Hara Title Logo Launched)

టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. దర్శకుడు షేర్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలి. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘హర ఓం హర’ (Hara Om Hara Movie) సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు షేర్‌కు అభినందనలు. షేర్ తెలుగులోనే కాకుండా అన్ని భాషల చిత్రాలను తెరకెక్కించే స్థాయికి చేరుకోవాలి. షేర్ ప్రతిభ ప్రపంచస్థాయికి వెళ్లాలని కోరుతున్నానన్నారు.

నటుడు, దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. మాది సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కాదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. నటుడిగా, హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా ఇలా పలు శాఖల్లో పని చేశాను. నాకు ఈ ఇండస్ట్రీలో భాష్యశ్రీ, డైరెక్టర్ బాలా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమా టైటిల్ లోగో వేడుకకు సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, గురురాజ్ వంటి పెద్దల వచ్చి.. ఆశీర్వదించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..

**************************************

*VV Vinayak: డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల్లో ‘సాక్షి’

**************************************

*TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానమిదే!

**************************************

*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం

**************************************

*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!

**************************************

Updated Date - 2023-07-01T21:26:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!