సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hero Nani: ఆ చర్చలో అదే జరిగింది.. చాలా దురదృష్టం

ABN, First Publish Date - 2023-03-17T17:47:56+05:30

‘కేజీయఫ్‌’ చిత్రంపై దర్శకుడు వెంకటేశ్‌ మహా చేసిన కామెంట్స్‌పై తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని స్పందించారు. ఈ చర్చలో జరిగిన మొత్తం వ్యవహారాన్ని ఉద్దేశించి దురదృష్టకరమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కేజీయఫ్‌’ (Kgf Comments) చిత్రంపై దర్శకుడు వెంకటేశ్‌ మహా (venkatesh maha) చేసిన కామెంట్స్‌పై తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని స్పందించారు. ఈ చర్చలో జరిగిన మొత్తం వ్యవహారాన్ని ఉద్దేశించి దురదృష్టకరమన్నారు. వెంకటేశ్‌ మహా మాట్లాడిన తీరు కరెక్ట్‌ కాదని నాని (Nani comments) అభిప్రాయపడ్డారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్‌ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్‌ మహా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘కేజీయఫ్‌’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ.. ‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేేస్త మనం చప్పట్లు కొడుతున్నాం, కోట్లు కలెక్షన్లు తెచ్చిపెడుతున్నాం’ అంటూ పలు అసభ్య పదజాలాన్ని ఉపయోగించి దర్శకుడు వెంకటేశ్‌ మహా చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! కేజీఎఫ్‌, యశ్‌ అభిమానులు వెంకటేశ్‌పై విపరీతంగా ట్రోల్‌ చేశారు.

దీనిపై వెంకటేశ్‌ మహా వివరణ ఇచ్చారు. తాజాగా దీనిపై నాని మాట్లాడారు. ‘‘కమర్షియల్‌ సినిమా అనే అంశంపై దర్శకులు పాల్గొన్న చర్చను నేనూ చూశా. వెంకటేశ్‌ మహా మాట్లాడిన విధానం కరెక్ట్‌ కాదు. ఓ సినిమా చూసొచ్చాక దాని గురించి మన ఫ్రెండ్స్‌తో ఒకలా మాట్లాడతాం, మరొకరితో ఇంకోలా మాట్లాడతాం. అదే పాయింట్‌ చర్చ వేదికల్లో ఇంకోలా చెబుతాం. ఇటీవల జరిగిన దర్శకుల చర్చాలోనూ అదే జరిగింది. కమర్షియల్‌ సినిమా అనే అంశంపై జరుగుతున్న చర్చ కాస్త ఉన్నట్లుండి థియేటర్‌ బయట మాట్లాడే విధంగా మారింది. అతను విమర్శలు ఎదుర్కొవడానికి కారణం అదే. ఆ టాపిక్‌ మాట్లాడుతున్నప్పుడు మహా కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోయేది. ఈ వివాదంపై ఇప్పటికే వివరణ ఇచ్చాడు కాబట్టి.. అతడి గురించి మాట్లాడను. ఇక అదే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు బాగా తెలుసు. వారితో నేను పనిచేశాను. వాళ్లకు మాస్‌, కమర్షియల్‌ సినిమా అంటే ఎంతో ఇష్టమో నాకు తెలుసు. ఓ అభిప్రాయాన్ని సరదాగా చెప్పినప్పుడు పక్కన ఉన్న వాళ్లు నవ్వడం సహజం. దాన్ని తప్పుగా అనుకొని వాళ్లందర్నీ విమర్శించడమూ కరెక్ట్‌ కాదు. జరిగిన ఇంటర్వ్యూ మొత్తంలో చిన్న క్లిప్‌ను పట్టుకు ఒక అభిప్రాయానికి రాకూడదు. నేను అయితే అలా చేయను. ఏది ఏమైనా అలాంటి సంఘటన చోటుచేసుకోవడం నిజంగా దురదృష్టకరం’’ అని అన్నారు నాని. (KGF Chapter2)

Updated Date - 2023-03-17T18:09:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!