కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi-Kalyan Krishna: మెగా ఆఫర్‌.. ఎలా డీల్‌ చేస్తాడో..

ABN, First Publish Date - 2023-08-13T12:59:12+05:30

చిరంజీవి హీరోగా నటించగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘భోళా శంకర్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్దింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ఫెయిల్యూర్‌ ఒత్తిడి అంతా తదుపరి చిత్ర దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ మీదే పడుతోంది.

చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్దింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ఫెయిల్యూర్‌ ఒత్తిడి అంతా తదుపరి చిత్ర దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ మీదే పడుతోంది. ఎందుకంటే హీరోగా చిరంజీవికి ‘గాడ్‌ఫాదర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ రెండు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలే. వేదాళం రీమేక్‌ కూడా హిట్‌ అవుతుందనే భావించారు. కానీ డిజాస్టర్‌ కావడంతో తదుపరి పక్కాగా హిట్‌తోనే రావాలని ఏ హీరోకి అయినా ఉంటుంది. స్టార్‌ హీరోతో అవకాశం వచ్చినప్పుడు హిట్‌ ఇవ్వాలనే కసి అవకాశం పొందిన దర్శకుడిలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఒత్తిడి తీసుకుంటున్నారు కల్యాణ్‌ కృష్ణ.(kalyan krishna)

ఎందుకంటే ఆయన ట్రాక్‌ రికార్డ్‌ కూడా అంత బాగోలేదు. ఇప్పటి దాకా ఆయన ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, నేల టిక్కెట్‌, బంగార్రాజు.. చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే ఆయన అందుకున్న హిట్‌ మాత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఒక్కటే! బంగార్రాజు కమర్షియల్‌ ఆడింది కానీ మొదటి భాగమంత హిట్టేమీ కాదు. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, నేల టికెట్‌’ కూడా ఫెయిల్యూర్‌ తర్వాత అతనికి మెగా ఆఫర్‌ వచ్చింది. ఆయన తీయబోయే చిత్రం మలయాళం హిట్‌ చిత్రం ‘బ్రో డాడీ’కి రీమేక్‌ అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తెలుగు ఆడియన్స్‌ మెచ్చే కథ కాదని తెలుస్తోంది. అయితే ఈ కథను ప్రసన్నకుమార్‌ పూర్తి మార్పులు చేస్తున్నారని టీమ్‌ చెబుతోంది. అసలు నిజం ఏంటనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్‌ చేయాల్సిందే! దీంతో చిరంజీవికి హిట్‌ ఇవ్వాలని, దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే తరుణంలో కల్యాణ్‌ కృష్ణపై ఒత్తిడి పెరిగినట్లే!

Updated Date - 2023-08-13T13:00:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!