RRR - Fans war: పరాకాష్టకు ఫ్యాన్స్ వార్... హెచ్‌సీఏ వివరణ!
ABN, First Publish Date - 2023-03-03T12:37:17+05:30
అభిమానుల అత్యుత్సాహం పరాకాష్టకు చేరుతుంది. ఒక్కోసారి వారి చేష్టలు హీరోలు తల దించుకునేలా చేస్తున్నాయి. ఫ్యాన్స్ వార్ వల్ల ఇలా జరిగిన సందర్భాలెన్నో. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది.
అభిమానుల అత్యుత్సాహం పరాకాష్టకు చేరుతుంది. ఒక్కోసారి వారి చేష్టలు హీరోలు తల దించుకునేలా చేస్తున్నాయి. ఫ్యాన్స్ వార్ వల్ల ఇలా జరిగిన సందర్భాలెన్నో. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది. ‘మా హీరోకి అవార్డ్ వచ్చింది.. మీ హీరోకు రాలేదు’ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు(Fans war in Social media). తాజాగా హెచ్‌సీఏ (HCA AWards) అవార్డుల విషయంలో ఇదే జరిగింది. అభిమానుల వార్‌కి సదరు అవార్డు సంస్థే వివరణ ఇచ్చే స్థితికి తీసుకొచ్చారు. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారాల్లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఒకటి. గత శుక్రవారం ఈ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలో వైభవంగా జరిగింది. ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ విభాగాల అవార్డులతోపాటు ‘హెచ్‌సీఏ’ స్పాట్‌లైట్ (Spotlight award) అవార్డులను ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)దక్కించుకుంది. హీరోల్లో రామ్‌చరణ్ ఒక్కడే ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై నెటిజన్లు, అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ‘ఎన్టీఆర్‌ని ఆహ్వానించలేదా?’ అందులో ఎన్టీఆర్‌కు అవార్డు ఎందుకు రాలేదంటూ ఫ్యాన్స్ వార్ మొదలుపెట్టారు. హెసీఏను టార్గెట్ చేసి ట్వీట్లు చేశారు. మూడు రోజుల క్రితం హెసీఏ స్పందించింది. ‘ఎన్టీఆర్‌కు మేం ఆహ్వానం అందించాం.. కానీ ఆయన కొత్త సినిమా షూటింగ్, వ్యక్తిగత కారణాల వల్ల అవార్డు వేడుకకు హాజరుకాలేకపోయారు’’ అని ట్వీట్ చేసింది హెచ్‌సీఏ సంస్థ. అయినప్పటికీ నెట్టింట వార్ తగ్గకపోవడంతో హెచ్‌సీఏ మరోసారి స్పందించింది. హెచ్‌సీఏకు మద్దతుగా.. ఎన్టీఆర్ అభిమానులను విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు హెచ్‌సీఏ బృందం తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఎన్టీఆర్‌కు అవార్డులు కొత్తేమీ కాదు’. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి గానూ ఎన్టీఆర్, అలియాభట్‌కు వచ్చేవారం ‘హెచ్‌సీఏ’ అవార్డులను పంపిస్తున్నాం’ అని చెబుతూ శుక్రవారం హెచ్‌సీ అవార్డు బృందం ఓ ట్వీట్ చేసింది. నటీనటుల పేర్లతో ఉన్న ట్రోఫీల ఫొటోలను షేర్ చేసింది. (Ram charan and ntr Fans wars)
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘భారతీయ చిత్రాలకు హెచ్‌సీఏ అవార్డులు ఇవ్వడం ఇదే చివరిసారి అవుతుందేమో! ఎందుకంటే, కొంతమంది అభిమానుల అవార్డు సంస్థలను బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. భవిష్యత్తులో ఎన్టీఆర్‌కు ఎన్నో అవార్డులు రావాలి’’ అని ట్వీట్ చేశాడు. నెటిజన్ ట్వీట్‌కు హెచ్‌సీఏ బృందం స్పందిస్తూ.. ‘‘ఆయనకు ఎప్పుడూ అవార్డులు వస్తూనే ఉంటాయి. అయితే హెచ్‌సీ అవార్డును ఆయన వ్యక్తిగతంగా వచ్చి అందుకోలేకపోయారు’’ అని పేర్కొన్నారు. ఈ తీరును గమనించిన మరికొందరు నెటిజన్లు హెచ్‌సీఏ సంస్థను ట్రోల్ చేస్తూ, అడిగి మరీ అవార్డు తీసుకున్నట్లుగా ఉంది’’ అని కామెంట్ చేశారు. (Hca clarity on ntr Award)