కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Shankar: ముందు బాబాయ్‌.. తర్వాతే అబ్బాయ్‌!

ABN, First Publish Date - 2023-08-25T11:36:53+05:30

‘ముందు బాబాయ్‌.. ఆ తర్వాత అబ్బాయ్‌’ అంటున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్‌కు ఆయన ఇచ్చిన సమాధానమిది. ‘గాంఢీవధారి అర్జున’ విడుదల సందర్భంగా వరుణ్‌తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

‘ముందు బాబాయ్‌.. ఆ తర్వాత అబ్బాయ్‌’ అంటున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) . వరుణ్‌ తేజ్‌కు ఆయన ఇచ్చిన సమాధానమిది. ‘గాంఢీవధారి అర్జున’ విడుదల సందర్భంగా వరుణ్‌తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘‘గద్దలకొండ గణేష్‌’ (Gaddalakonda Ganesh) లాంటి మరో సినిమా కావాలి. అందులో అక్రమార్జన, మొరటుతనం, సంభాషణలు అద్భుతం. మీ ఇద్దరి కాంబినేషన్‌లో ఇలాంటి సినిమా మరొకటి తప్పకుండా వస్తుందని ఆశ’’ అని ఓ నెటిజన్‌ వరుణ్‌ను అడిగారు. దానికి వరుణ్‌ తేజ్‌(Varusn Tej) హరీశ్‌ శంకర్‌ను (harish Shankar)m ట్యాగ్‌ చేసిన ‘వింటున్నావా హరీశ్‌ బ్రో’ అని ట్వీట్‌ చేశారు.

వరుణ్‌ తేజ్‌ ప్రశ్నకు హరీశ్‌ శంకర్‌ సమాధానమిచ్చారు. ‘‘హ..హ..హ నా చెవులతో వింటున్నా. ముందు బాబాయ్‌ తర్వాత అబ్బాయి. తప్పకుండా చేద్దాం’ అని హరీశ్‌ రిప్లై ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే వరుణ్‌ తేజ్‌, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లే అర్థమవుతోంది.

వరుణ్‌తేజ్‌ హీరోగా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసింది. 2019 సెప్టెంబర్‌ 20న ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ఆడింది. తాజాగా వరుణ్‌తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated Date - 2023-08-25T11:36:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!