సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hanu-Man: హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా..

ABN, First Publish Date - 2023-05-05T19:31:27+05:30

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) దర్శకత్వం వహించిన చిత్రం ‘హను-మాన్‌’(Hanu man) . తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మొదట వేసవిలో మే 12న విడుదల చేయాలని భావించారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ‘‘హనుమాన్‌’ టీజర్‌పై మీరు చూపించిన అపరిమితమైన ప్రేమ మా మనసుని హత్తుకుంది. దీంతో సినిమా విషయంలో మా పై బాధ్యత పెరిగింది. అందరూ కలిసి సెలబ్రేట్‌ చేసుకునేలా, హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. బిగ్‌ స్ర్కీన్‌ పై ‘హనుమాన్‌’ను మీకు చూపించేందుకు మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని నిర్మాణ సంస్థ తెలిపింది.

తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‌, స్పానిష్‌, కొరియన్‌, చైనీస్‌, జపనీస్‌తో సహా ప్యాన్‌ వరల్డ్‌ సినిమాగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తేజ సజ్జ సరసన అమృత అయ్యర్‌ కథానాయికగా నటిస్తుండగా, వినయ్‌ రాయ్‌ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (Hanuman Postponed)

Updated Date - 2023-05-05T19:31:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!