AlluArha: అల్లు అర్జున్, అతని కూతురి గురించి గుణశేఖర్, సమంత ఏమ్మన్నారో తెలిస్తే షాక్ అవుతారు
ABN, First Publish Date - 2023-04-05T12:30:05+05:30
మాతృభాష మీద వున్న మమకారాన్ని చాలామంది మైకుల ముందు చెపుతారు, కానీ అల్లు అర్జున్, స్నేహ లు మాత్రం చేసి చూపించి వాళ్లిద్దరూ బెస్ట్ పేరెంట్స్ అని నిరూపించుకున్నారు. అదెలా అంటే...
అల్లు అర్జున్ (Allu Arjun) భార్య అల్లు స్నేహ రెడ్డి (Allu Sneha Reddy) అందరిలోనూ టాప్ అని నిన్ననే ఒక వార్త రాసాము. ఇప్పుడు దానికన్నా ఎక్కువ, ఇంకా గౌరవం పెరిగేలా స్నేహ, ఆమె భర్త నటుడు అల్లు అర్జున్ చేశారు. అదేంటి అంటే తమ కూతురు అల్లు అర్హ (Allu Arha) కి ఒక్క ఇంగ్లీష్ పదం కూడా నేర్పకుండా కేవలం మాతృభాష (Mother tongue Telugu) అయిన తెలుగు మాత్రమే నేర్పడం. వాళ్ళకి మాతృభాష మీద వున్న మమకారం అటువంటిది, అదొక్కటి చాలు వాళ్ళిద్దరికీ ఎంతో గౌరవం దక్కడానికి. ఈరోజు ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలని, తల్లిదండ్రులు తెలుగు మాట్లాడితే పిల్లలని కోప్పడే సన్నివేశాలు ఎన్నో చూస్తున్నాం. అటువంటిది ఒక పెద్దింట్లో పుట్టిన పాపకి, చిన్నప్పుడే తెలుగు మాత్రమే నేర్పడం నిజంగా అల్లు అర్జున్, స్నేహ లను మెచ్చుకోవాలనే అంటున్నారు దర్శకుడు గుణశేఖర్ (Guanasekhar), నటి సమంత (Samantha).
దర్శకుడు గుణశేఖర్ 'శాకుంతలం' (Shaakuntalam) సినిమా ఏప్రిల్ 14 న విడుదల వుతోంది. అందులో ప్రచారం లో భాగంగా గుణశేఖర్, సమంత ఆ సినిమా గురించి మాట్లాడేరు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ (Allu Arha) అందులో చిన్నప్పటి భరతుడిగా వేసింది. ఆమె నటన గురించి ప్రస్తావిస్తూ, గుణశేఖర్ ఈ మాటలు అన్నాఋ. "అల్లు అర్జున్, స్నేహ లని ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళ నుండి చాలా నేర్చుకోవాలి. తమ పాప అయిన అల్లు అర్హ కి ఒక్క ఇంగ్లీష్ పదం రాదంటే మీరు నమ్ముతారా. ఆలా పెంచారు. వాళ్ళకి మాతృభాష మీద వున్న మమకారం అలాంటింది. అల్లు అర్జున్ కి మన తెలుగు అన్న, తెలుగు సంస్కృతి అన్న అంత ఇష్టం. అందుకే నేను 'రుద్రమదేవి' (Rudhramadevi) సినిమా చేసినప్పుడు గోన గన్నారెడ్డి పాత్ర అడగ్గానే చేసాడు," అని చెప్పాడు గుణశేఖర్.
తల్లి దండ్రులు మాట్లాడుతుంటే పిల్లలకి కొన్ని పదాలు అయినా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, కానీ అర్హ కి ఇంగ్లీష్ అసలు తెలియదు, నిజంగా ఆ తల్లిదండ్రులు గ్రేట్ అంది సమంత (SamanthaRuthPrabhu). అతను వూరికే అయిపోలేదు ఐకాన్ స్టార్ (Icon Star) అని చెప్పాడు గుణశేఖర్. "మాతృ భాషకి ఇచ్చే రెస్పెక్ట్, సంస్కృతి ఇలాంటి వాటివల్ల అతను అయ్యాడు," అని చెప్పాడు గుణశేఖర్. 'శాకుంతలం' తీస్తున్న, మీ అమ్మాయికి అందులో ఒక పాత్ర వుంది అంటే, వెంటనే సరే 'తీసుకోండి' అని తన అమ్మాయిని కోవిడ్ టైమ్ లో పంపాడు. అది అల్లు అర్జున్ అంటే. అందుకే అతను ఐకాన్ స్టార్ అయ్యాడు అని గుణశేఖర్ ఎంతో ప్రశంసించాడు. చివరి 15 నిముషాలు అర్హ మీదే ఉంటుంది సినిమా అని చెప్పారు దర్శక (Dil Raju) నిర్మాతలు.