సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Gunasekhar: అడిగి లేదనిపించుకోవడం ఎందుకని...

ABN, First Publish Date - 2023-04-13T08:56:43+05:30

గుణశేఖర్‌ (Guna sekhar) టాలీవుడ్‌ హీరోలపై కామెంట్‌ చేశారు. కొన్ని పాత్రలు చేసే విషయంలో వారి తీరు మారాలని హితవు పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుణశేఖర్‌ (Guna sekhar) టాలీవుడ్‌ హీరోలపై కామెంట్‌ చేశారు. కొన్ని పాత్రలు చేసే విషయంలో వారి తీరు మారాలని హితవు పలికారు. ‘శాకుంతలం’(Shaakuntalam) చిత్రంలో దుష్యంతుడి పాత్రకు దేవ్‌ మోహన్‌ను తీసుకోవడానికి గల కారణం చెప్పారు. ఈ నెల 14న ఆయన దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రకు చాలా కోణాలున్నాయి. ఆ పాత్రను తెలుగు హీరోలు చేస్తారనే నమ్మకం నాకు కలగలేదు. ఈ మధ్యకాలంలో మన హీరోలు నెగటివ్‌ షేడున్న పాత్రలు చేస్తున్నారు. అది కూడా ఆ కథలు హీరో ప్రధానంగా సాగితేనే! దుష్యంతుడి (Dev mohan) పాత్రలో కొన్ని వ్యతిరేక ఛాయలున్నాయి. 60 ఏళ్ల కిందట అలాంటి విషయాన్ని ఎన్టీఆర్‌ పట్టించుకోకుండా ఆ పాత్ర పోషించారు. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌లాంటి అతిథి పాత్రల్లో నటించడానికి వెనకాడరు. కానీ మన హీరోలు చేయరు. అడిగి లేదనిపించుకోవడం ఇష్టం లేక ఎవరినీ అడిగే ప్రయత్నం చేయలేదు. అందుకే ఆ పాత్ర కోసం దేవ్‌ మోహన్‌ను సంప్రదించా. ఆ పాత్ర కోసం ఎంత టైమ్‌ కావాలన్నా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ కథలో కీలకమైన దుర్వాస మహర్షి పాత్రను మోహన్‌బాబు చేయకపోతే ఆ ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిద్దామా అనుకున్నా. ఆయనకు పాత్ర నచ్చి వెంటనే అంగీకరించారు. ఇందులో చాలా పాత్రలు అతిథి పాత్రల్లా ఉంటాయి. అవన్నీ ఎప్పటికీ గుర్తిండిపోతాయి. (Shaakuntalam on 14 April)

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం 7 అంకాలుగా ఉంటుంది. ఆ కథని ఈ తరానికి చెబితే బాగుంటుందనిపించింది. గొప్ప విలువలున్న కథ ఇది. శకుంతలను ఎక్కువగా శృంగార కోణంలోనే చూపించారు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న సౌందర్యరాశి. ఆదిపర్వంలో శకుంతల కథకి తనదైన శైలిలో కొన్ని పాత్రల్ని జోడించి అభిజ్ఞాన శాకుంతలం రాశారు కాళిదాసు. ఇప్పటి యువతరం బాగా కనెక్ట్‌ అవుతుందని నమ్మా. శకుంతల పాత్రలో శృంగార కోణానికి రెండో ప్రాధాన్యం ఇచ్చి, ఆమె ఆత్మాభిమానాన్ని ముఖ్యంశంగా తీసుకుని సినిమా తీశా. అప్పట్లోనే పెళ్లి కాకుండా బిడ్డకి జన్మనిస్తుంది శకుంతల. దానితో సమాజం నుంచి వ్యతిరేకతని ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లోనూ విలువలు, ఆత్మాభిమానం కోసం నిలబడి అనుకున్నది సాధించిన పురాణ స్ర్తీ శకుంతల. నేటి తరానికి ఆమె ఒక ఇన్స్‌పిరేషన్‌. సమంత ఈతరం అమ్మాయి. ఆమెకు ఆధునికి పాత్రలపై ఉన్న అవగాహన పురాణ పాత్రలపై ఉండకపోవచ్చు. పురాణ పాత్రకి తగ్గట్టుగా మారడం అంత సులభ కాదు. ఆమె నృత్యం పరంగా, ఆ పాత్రకి తగ్గట్టుగా తనని తాను సన్నద్థం చేసుకోవడం కోసం అరుణ భిక్షు దగ్గర శిక్షణ తీసుకున్నారు.

Updated Date - 2023-04-13T11:54:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!