సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Charan -Rc15 Sets: అదిరిపోయే వెల్‌కమ్‌ చెప్పిన పి.డి.మాస్టర్‌!

ABN, First Publish Date - 2023-03-19T19:00:43+05:30

ఆస్కార్‌ వేడుక ముగించుకున్న రామ్‌ చరణ్‌ అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్కార్‌ వేడుక ముగించుకున్న రామ్‌ చరణ్‌(Ram charan)అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ (shankar) దర్శకత్వం వహిస్తున్న ఆర్‌సీ15 (RC15) లో నటిస్తున్నారు. తాజాగా షూటింగ్‌లో అడుగుపెట్టేందుకు వచ్చిన వచ్చిన చరణ్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలో ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్‌కమ్‌ చెప్పింది. రామ్‌చరణ్‌ను (Grand welcome to Ram charan) పూలమాలతో సత్కరించారు. ఆ వీడియోను రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ థ్యాంక్స్‌ చెప్పలేను. నాకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన గ్రాండ్‌ మాస్టర్‌ ప్రభుదేవా (Prabhudeva For RC15) సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్‌కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.’ అరి చరణ్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనికి రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ‘స్వీటెస్ట్‌ వెల్‌కమ్‌’ అంటూ కామెంట్‌ చేసింది. అయితే దీన్ని బట్టి చూస్తే ఆర్‌సీ 15లో ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఎస్‌జె సూర్య, జయరామ్‌, అంజలి, శ్రీకాంత్‌ కీలక పాత్రధారులు.

Updated Date - 2023-03-19T19:00:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!