సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఈ సమ్మర్‌లోనే ‘గేమ్ ఆన్’ అవుతుంది

ABN, First Publish Date - 2023-04-13T06:44:24+05:30

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్న విశేషమేమిటంటే.. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం. మధు బాల, ఆదిత్య మీనన్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి  రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు. అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్‌ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో ఆద్యంతం ఉత్కంఠగా సాగే  కోర్‌ డ్రామా చిత్రమిది. సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ‘‘రథం చిత్రం తర్వాత గీతానంద్‌ని మరోస్థాయిలో నిలబెట్టే చిత్రమిది. గీతానంద్‌, దయానంద్‌ ఇద్దరితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం గొప్ప స్టార్‌ క్యాస్ట్‌ తీసుకున్నాం. కీలక పాత్ర పోషించిన మధుబాల గతంలో ఎన్నడూ చేయని పాత్ర ఈ చిత్రంలో చేశారు. న్యూఏజ్‌ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది. మధుబాల పాత్రకు కుటుంబ ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్‌ అవుతారు. కార్తికేయ 2తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్‌ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. నేహా సోలంకి నటనతోపాటు అందచందాలతో కూడా ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ నవాబ్‌  గ్యాంగ్‌ అందించిన సంగీతం సినిమాకు ఎసెట్‌ అవుతుంది. అనురాగ్‌ కులకర్ణి, హారిక నారాయణ్‌ పాడిన రెండో పాట ‘పడిపోతున్నా’ 2 రోజుల్లో 2 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. ఆ స్పందనతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. అరవింద్‌ విశ్వనాథన్‌ అద్భుతంగా విజువల్స్‌ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అలాగే ఈ సినిమాకు మేము చేసే ప్రమోషన్స్ కూడా వినూత్నమైన రీతిలో ఉంటాయి. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని అన్నారు.

దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘‘తెలుగులో ఇప్పుడు డిఫరెంట్‌ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్‌ కూడా అవుతున్నాయి. ఓ మార్క్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఆ కోవలోనే గేమ్‌ ఆన్‌ సినిమా ఉంటుంది. ట్విస్టులు, టర్నులతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌... అన్ని రకాల ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు.

Updated Date - 2023-04-13T06:44:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!