సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

VishwakSen: ముందు నితిన్, తరువాత శర్వానంద్ ఇప్పుడు....

ABN, First Publish Date - 2023-03-31T17:46:10+05:30

దర్శకుడు కృష్ణ చైతన్య, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో ఒక సినిమా సితార వంశీ విశ్వక్ పుట్టినరోజునాడు ప్రకటించారు. అయితే ఈ కథ ఇంతకుముందు నితిన్, శర్వానంద్ లకు చెప్పినదేనా లేక వేరే కథా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని రోజుల క్రితం సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ (Sithara Entertainment) విశ్వక్ సేన్ (Vishwak Sen) పుట్టినరోజు సందర్భంగా ఒక సినిమా అధికారికంగా ప్రకటించింది. అందులో విశ్వక్ సేన్ లీడ్ యాక్టర్ కాగా, కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకుడు అని చెప్పారు. ఈ సినిమాకి నాగవంశి (Naga Vamsi) తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) భార్య సాయి సౌజన్య (Sai Soujanya) కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే పరిశ్రమలో ఈ సినిమా గురించి ఒక టాక్ నడుస్తోంది. దర్శకుడు కృష్ణ చైతన్య ఇదే కథని ముందు నితిన్ (Nithiin) దగ్గరకి పట్టుకొని వెళ్లాడని, నితిన్ చేస్తాను అన్నాడు కానీ ఎందుకో అది వర్క్ అవుట్ కాలేదు అని తెలిసింది. అప్పట్లో నితిన్ కూడా కృష్ణ చైతన్య తో సినిమా ఉందని చాలా సార్లు చెప్పాడు కూడా. ఆ తరువాత నితిన్ వేరే సినిమా చెయ్యడం అది సరిగ్గా నడకపోవటంతో కృష్ణ చైతన్య తో చెయ్యాల్సిన సినిమా మరి చెయ్యలేదు. కథ నచ్చినా నితిన్ ఎక్స్ పెరిమెంట్ చెయ్యడం ఇష్టం లేక చెయ్యలేదు ఒక వార్త నడిచింది అప్పట్లో.

చాలా కాలం ఎదురు చూసిన దర్శకుడు అదే కథని శర్వానంద్ (Sharwanand) దగ్గరకి కూడా తీసుకెళ్లాడు. శర్వానంద్ కూడా ఈ కథ బాగుంది చేస్తాను అని చెప్పాడు అని తెలిసింది. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. శర్వానంద్ చుట్టూ కూడా తిరిగి, కృష్ణ చైతన్య తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కి ఈ కథని వినిపించాడని ఒక టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ కి ఈ కథ నచ్చి సితార వంశీ తో చేద్దాం అని చెప్పాడని కూడా అంటున్నారు. ఆలా మొత్తానికి ఆ కథ ఇప్పుడు కృష్ణ చైతన్య, విశ్వక్ సేన్ తో చేస్తున్నది అని వినికిడి. కృష్ణ చైతన్య ఒక టాలెంటెడ్ దర్శకుడు, మంచి కథలు వినిపిస్తాడు, కానీ సరి అయిన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.

Updated Date - 2023-03-31T17:46:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!