సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

DeathAnniversary: రమేష్ బాబు వర్ధంతి నేడు

ABN, First Publish Date - 2023-01-08T16:23:22+05:30

గత సంవత్సరం ఘట్టమనేని (Last year is a sad one for Ghattamaneni family especially for Mahesh Babu) కుటుంబానికి ముఖ్యంగా మహేష్ బాబు కి విషాదాన్ని మిగిల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత సంవత్సరం ఘట్టమనేని (Last year is a sad one for Ghattamaneni family especially for Mahesh Babu) కుటుంబానికి ముఖ్యంగా మహేష్ బాబు కి విషాదాన్ని మిగిల్చింది. ముందు మహేష్ బాబు అన్న, నటుడు రమేష్ బాబు చనిపోయారు. ఆ తరువాత మహేష్ బాబు తల్లి గారు ఇందిరాదేవి కన్ను మూసారు. ఈ ఇద్దరి విషాదం నుండి ఇంకా కోలుకోకుండానే, మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు హఠాత్తుగా కన్ను మూసారు. (Ramesh Babu, Indira Devi and SuperStar Krishna passed away) ఈ ముగ్గురు సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితం లో అతి ముఖ్యమయిన వాళ్ళు. ఈరోజు రమేష్ బాబు ప్రధమ వర్థంతి. (January 9 is the first death anniversary of Ramesh Babu) మహేష్ బాబు కుటుంబం, విదేశాల నుండి ఆరో తేదీన హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఫిలిం నగర్ లోని, ఎఫ్.ఎం.సి.సి. లో రమేష్ బాబు వర్ధంతి చేశారు. (FNCC at FilmNagar)

పరిశ్రమ నుండి చాలామంది మహేష్ బాబు సన్నిహితులు, కుటుంబ స్నేహితులు ఇంకా చాలామంది విచ్చేసి రమేష్ బాబు కి నివాళులు అర్పించి, మహేష్ బాబు ని కలిశారు. మహేష్ బాబు చిన్నాన్న, కృష్ణ గారి సోదరుడు అయిన ఆదిశేషగిరి రావు (G Adiseshagiri Rao) గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్ని చేసినట్టుగా తెలిసింది. అలాగే చలన చిత్ర పరిశ్రమ నుండి కృష్ణ గారి కుటుంబానికి మొదటి నుండీ సన్నిహితంగా వున్న చాలామంది రమేష్ బాబు ప్రధమ వర్థంతి కి హాజరు అయినట్టుగా తెలిసింది. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి వుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కేవలం అయిదారు రోజులు మాత్రమే జరిగి ఆ తరువాత అనుకోని సంఘటనలతో వాయిదా పడుతూ వస్తోంది. జనవరి 9 (Janauary 9) నుండి షూటింగ్ మొదలు పెడతారు అని కూడా తెలిసింది, కానీ మళ్ళీ పండగ తరువాత చేస్తే బాగుంటుంది అన్న సూచన కూడా వినపడుతోంది.

Updated Date - 2023-01-08T16:23:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!