కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eagle: మొత్తానికి.. రవితేజ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది

ABN, First Publish Date - 2023-11-05T16:12:16+05:30

దసరాకు ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనుకున్నంత విజయం సాధించలేక పోయింది. దీంతో నెక్ట్స్ 2024 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న ‘ఈగల్’ సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. అదే పండుగకు నాలుగు భారీ బడ్జెట్ తెలుగు చిత్రాలు వస్తుండడంతో ‘ఈగల్‘ వాయిదా పడినట్లు వారం రోజులుగా వార్తలు షికార్లు చేశాయి. ఈ విషయమై మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

రవితేజ.. తెలుగు ఇండస్ట్రీలో జయపజయాలకు సంబంధం లేకుండా ఏడాదిలో ఐదారు సినిమాలు చేసే హీరోల్లో మొదటి వరుసలో ఉంటాడు. ప్రతి యేడు తనవి మూడు , నాలుగు సినిమాలు విడుదల అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ’వాల్తేరు వీరయ్య‘తో వచ్చిన ఆయన వేసవిలో ’రావణాసుర‘, దసరాకు ’టైగర్ నాగేశ్వరరావు‘ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా నిర్మాతగా రూపొందించిన ’ఛాంగురే బంగారు రాజా‘ సినిమా విడుదలవగా, వైవా హర్ష హీరోగా నిర్మించిన ’సుందరం మాస్టర్‘ విడుదల కావాల్సి ఉంది.

అయితే ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘టైగర్’ చిత్రం అనుకున్నంత విజయం సాధించక పోవడంతో 2024 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న ‘ఈగల్’(Eagle) సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. అదే పండుగకు మహేశ్ బాబు ’గుంటూరు కారం‘, విజయ్ దేవరకొండ ’ఫ్యామిలీ స్టార్‘, ప్రశాంత్ వర్మ ’హనుమాన్‘ వంటి నాలుగు భారీ బడ్జెట్ తెలుగు చిత్రాల విడుదలకు సిద్ధమవడంతో రవితేజ ‘ఈగల్‘ వాయిదా పడినట్లు వారం రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయమై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేయడంతో మేకర్స్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో సినిమా ఉంటుందని వాయిదా వేయడం లేదని స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిత్రం గురించి ఆఫ్డేట్ ఇచ్చిన నిర్మాతలు, టీజర్ విడుదల తేదీని ఎనౌన్స్ చేశారు. నవంబర్ 6 సోమవారం ఉదయం 10.44 నిమిషాలకు చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీక్రెట్ రా ఎజెంట్ గా నటిస్తున్న రవితేజకు (Ravi Teja)కు జోడీగా అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ ఆడిపాడనున్నారు. మరి ఈ సినిమా అయినా మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి.

Updated Date - 2023-11-05T16:21:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!