TFI : సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీపై దాడి!
ABN, First Publish Date - 2023-10-31T11:01:49+05:30
తెలుగు సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కాట్రగడ్డ సుధాకర్ ఇంటిపై దాడి జరిగింది. ఇంటిని, కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఏడుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు.
తెలుగు సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కాట్రగడ్డ సుధాకర్ ఇంటిపై దాడి జరిగింది. ఇంటిని, కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఏడుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తి సినీ మేనేజర్ హరినాథ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో సుధాకర్ ఇంటి వద్ద అదే యూనిట్‌కు చెందిన వ్యక్తులతో కలిసి హరినాథ్ నానా హంగామా చేశారని సుధాకర్ పేర్కొన్నారు. సెల్ఫీ వీడియో తీస్తూ సుధాకర్ అంతు చూస్తానని హరినాథ్ బెదిరించారు.