సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

MegaStarChiranjeevi: బాస్ పక్కన హీరోయిన్ ఫిక్స్ అయింది, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

ABN, First Publish Date - 2023-06-01T10:42:55+05:30

చిరంజీవి, సిద్ధూ జొన్నలగడ్డ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తుండగా, దీనికి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. సిద్ధూ పక్కన శ్రీలీల కథానాయకురాలిగా ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చిరంజీవి పక్కన కూడా కథానాయకురాలి ఫిక్స్ అయిందని, ఆమె మరెవరో కాదు, ఒక అగ్ర నటి అని తెలిసింది.

Chiranjeevi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi), డీజే టిల్లు సిద్ధు జొన్నలగెడ్డ (Jonnalagadda Siddhu) కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కళ్యాణ్ కృష్ణ (KalyanKrishna) దర్శకుడు కాగా, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల (SushmithaKonidela) నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగెడ్డ పక్కన శ్రీలీల (Sreeleela) వేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక అగ్రశ్రేణి తారని తీసుకున్నట్టుగా తెలిసింది. ఆమె ఎవరో కాదు, త్రిష కృష్ణన్ (TrishaKrishnan) అని తెలిసింది.

ఈ సినిమాలో చిరంజీవి, సిద్ధూ మీదే కథ మొత్తం నడుస్తుందని, ఈ కథ చాలా హిలేరియస్ గా ఉంటుందని ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళని బట్టి తెలుస్తోంది. అలాగే ఈ సినిమా తమిళం, మలయాళం, మిగతా భాషల్లోకి కూడా విడుదల చేయొచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇది మోహన్ లాల్ (MohanLal) నటించిన మలయాళం సినిమా 'బ్రో డాడీ' (BroDaddy) కి రీమేక్ అని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది ఆ సినిమాకి రీమేక్ కాదు. ఈ కథని ఇప్పుడు చాలామందికి కథలు అందిస్తున్న ఒక అగ్ర రచయిత నుండి తీసుకున్న కథ అని కూడా తెలిసింది.

అందుకనే ఈ సినిమాలో చిరంజీవి పక్కన త్రిష ని తీసుకున్నారని తెలిసింది. త్రిష ఇంతకు ముందు 'ఆచార్య' (Acharya) లో చిరంజీవి పక్కన చేయాల్సి వుంది, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమానుండి తప్పుకుంది. అప్పుడే మళ్ళీ చేద్దాం అని చిరంజీవి అన్నారని, అందుకనే ఇప్పుడు మళ్ళీ త్రిష ని ఈ సినిమాకి తీసుకొన్నారని కూడా తెలిసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని కూడా తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించి ఇంకో అప్డేట్ కోసం ఇక్కడ చూస్తూ వుండండి. చిరంజీవి ప్రస్తుతం 'భోళాశంకర్' (BholaaShankar) సినిమా పూర్తి చేసే పనిలో వున్నారు. దీనికి మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకుడు.

Updated Date - 2023-06-01T10:43:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!