Lethakulu: ఎస్తర్ కీలకపాత్రలో నటిస్తోన్న సినిమా టైటిల్ ఇదే..
ABN, First Publish Date - 2023-10-04T21:42:55+05:30
బ్యూటీఫుల్ హీరోయిన్ ఎస్తర్‌కు ఈ మధ్య వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె అన్నీ తానై ఓ మూవీని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న టాలీవుడ్ ఫిల్మ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. MR చౌదరి వడ్లబట్ల సమర్పణలో ఫ్రెష్ మూవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘లేతాకులు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
బ్యూటీఫుల్ హీరోయిన్ ఎస్తర్‌కు ఈ మధ్య వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె అన్నీ తానై ఓ మూవీని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఆ మూవీతో పాటు నటిగానూ ఆమెకు రెండు మూడు భాషల నుంచి అవకాశాలు వస్తుండటంతో.. ప్రస్తుతం ఎస్తర్ బిజీ నటిగా మారిపోయారు. తాజాగా ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న టాలీవుడ్ ఫిల్మ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. MR చౌదరి వడ్లబట్ల సమర్పణలో ఫ్రెష్ మూవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘లేతాకులు’ (Lethakulu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చంటి గాణమని దర్శకత్వంలో వెంకటేష్ చిక్కాల నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది.
ఎస్తర్, శృతి శరణ్, అవయుక్త, వంశీ పాండ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి బీసీ కమిషన్ ఛైర్మన్ వకలబరణం కృష్ణ మోహన్ రావ్ క్లాప్ నివ్వగా మోహన వడ్లపట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. తమ్ముడు సత్యం స్క్రిప్ట్ అందివ్వగా.. దర్శకులు వి సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర సమర్పకులు ఎం ఆర్ చౌదరి వడ్లపట్ల మాట్లాడుతూ... మా లేతాకులు సినిమా ఓ కొత్త కాన్పెస్ట్‌తో వస్తుంది. నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం నాకు ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటివరకు ఇటువంటి కాన్సెప్ట్ రాలేదు. ఇది ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుందని తెలపగా.. నిర్మాత వెంకటేష్ చిక్కాల మాట్లాడుతూ.. దర్శకత్వ శాఖలో 15 యేళ్లుగా పనిచేస్తున్నాను... కానీ చంటి గాణమని గారు చెప్పిన కథ బాగా నచ్చి సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాను. ఎస్తర్ మా సినిమాలో కీ రోల్ చేస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు.
హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ... దర్శకులు చంటి గాణమని చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నేను చేసిన సినిమాలతో పోల్చితే ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. నా కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలుస్తుందని అన్నారు. దర్శకులు చంటి గాణమని మాట్లాడుతూ.. నూతిలో కప్పలు సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా ‘లేతాకులు’. ఒకరిని బాధ పెట్టిన వారికి ఏదో శిక్ష విధించడం శిక్ష కాదు అదే బాధ వాళ్ళకి కలిగాలా చేయడమే అసలైన శిక్ష అని అండర్ కరెంట్‌గా చెప్పే కథ ఇది. మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*Yendira Ee Panchayithi: ‘ఏందిరా ఈ పంచాయితీ’కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసిందంటే..
******************************
*Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?
***********************************
*Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
********************************
*Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది
*********************************
*TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు
***********************************