సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rana Daggubati: నేను మొదట టాక్ షో చేసేటప్పుడు ఏమన్నారో తెలుసా...

ABN, First Publish Date - 2023-03-07T14:27:20+05:30

రానా దగ్గుబాటి, చిన్నాన్న వెంకటేష్ కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఇందులో ఇద్దరూ తండ్రీ కొడుకులుగా చేస్తున్నారు. ఇద్దరు పెద్ద నటులు ఇలా ఒక తెలుగు వెబ్ సిరీస్ లో నటించటం ఇదే మొదటిసారి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రానా దగ్గుబాటి (Rana Daggubati తన చిన్నాన్న వెంకటేష్ (Venkatesh) తో కలిసి ఒక వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (#RanaNaidu) చేస్తున్నాడు. ఇది నెట్ ఫ్లిక్ (Netflix) లో విడుదల అవుతోంది. దీనికి ప్రచారం లో భాగంగా హైదరాబాద్ లో మీడియా వాళ్ళతో మాట్లాడేరు రానా, వెంకటేష్ ఇద్దరూ. ఇప్పుడు థియేటర్ కి జనాలు రావటం లేదు, సినిమా చచ్చిపోతోంది అని గోల పెడుతున్నారు, మరి రానా, వెంకటేష్ కలిపి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా. సినిమానే చేయొచ్చు కదా అని అడిగితే, ఇది ఒక డిఫరెంట్ అనుభవం అని చెప్తున్నారు.

థియేటర్ లో సినిమా చూడటం ఒక రకమయిన ఎక్స్పీరియన్స్ అయితే, ఈ షో ని టీవీలో చూడటం ఇంకొక రకమైన అనుభవం. మీకు నచ్చకపోతే రిమోట్ తో ముందుకు జరిపేస్తారు. ఒకవేళ నచ్చితే రెండో సారి చూడొచ్చు. ఇది ఇంకొక రకమయిన అనుభవం. అయితే దేనికయినా మార్పు అనేది సహజం అని, దానితో పాటుగానే అందరూ వెళ్ళాలి అంటాడు రానా.

కొన్ని సంవత్సరాల ముందు తెలుగు నటులు హిందీ సినిమాలు చేస్తే ఆడవు, అలాగే తెలుగు సినిమాలు వేరే దగ్గర వేస్తె పోయేవి కాదు, డబ్బింగ్ సినిమాలు ఇక్కడ తెలుగులో విపరీతంగా చూసారు, ఇప్ప్పుడు మన తెలుగు సినిమాలు ప్రతి దగ్గరా ఆడుతున్నాయి. ఇవన్నీ కాలానుగుణంగా మార్పులు వచ్చాయి. నేను టాక్ షో చేసేటప్పుడు 'హీరో లు టాక్ షో చెయ్యడం ఏంటి, వద్దు, నడవదు అన్నారు. మరి ఇప్పుడు చాలామంది హీరోస్ టాక్ షోస్ చేస్తున్నారు కదా" అని అన్నాడు రానా. అలాగే తన రెండో సినిమా హిందీ లో నటించాను అని చెప్పాడు. ఇప్పుడు తెలుగు నటులు అందరూ హిందీ వాళ్ళకి తెలుసు అన్నాడు.

అలాగే ఈ వెబ్ సిరీస్ కూడా మొదటగా రానా, వెంకటేష్ లాంటి పెద్ద నటులు నటిస్తున్నారు. ఇలా పెద్ద నటులతో తెలుగులో వెబ్ సిరీస్ ఇంతవరకు రాలేదు. ఇలా తనే చాల విషయాలు ముందు మొదలెట్టడం తనకి చాలా సంతోషంగా ఉందని రానా చెప్పాడు.

Updated Date - 2023-03-07T14:27:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!