సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajamouli sentiment: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

ABN, First Publish Date - 2023-03-29T12:30:08+05:30

రాజమౌళి సెంటిమెంట్ పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి సినిమాలే నటించిన కథానాయకుల తదుపరి సినిమా ప్లాప్ అవుతూ వస్తూ వుంది ఇప్పటివరకూ. మరి ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ పెద్ద ప్రాజెక్ట్ లతో వున్నారు. మరి వీళ్ళు ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్ర పరిశ్రమలో ఒక మాట వినపడుతూ ఉంటుంది. రాజమౌళి (SS Rajamouli) తో ఒక సినిమాకు పని చేసిన కథానాయకుల అతని సినిమా తరువాత ఆ నటుడు సినిమా ఏది విడుదల అయినా అవి ప్లాప్ అవుతూ ఉంటాయి. ఇది అందరి విషయం లో ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలు అన్నిటికీ ఆలా అయింది. అయితే దీనికి రాజమౌళిని తప్పుపట్టడం కానీ, రాజమౌళిని నింద చేయలేము, చెయ్యకూడదు కూడా.

రాజమౌళి మొదటి సినిమా 'స్టూడెంట్ నెంబర్ 1' అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో తీసాడు. ఎన్టీఆర్ తదుపరి సినిమా 'సుబ్బు' ప్లాప్ అయింది. అదే ఎన్టీఆర్ తో మళ్ళీ 'సింహాద్రి' (Simhadri) తీసాడు, ఎన్టీఆర్ తరువాతి సినిమా 'ఆంధ్రావాలా' (Andhrawala) పెద్ద ప్లాప్ అయింది. అలాగే 'యమదొంగ' (Yamadonga) తరువాత వచ్చిన 'కంత్రి' ప్లాప్ అయింది. ఇంకా నితిన్ (NIthiin) కి కూడా 'సై' (Sye) తరువాత 'అల్లరి బుల్లోడు' (Allari Bullodu), రవితేజ (Ravi Teja) కి 'విక్రమారుకుడు' తరువాత వచ్చిన 'ఖతర్నాక్' ప్లాప్ అయ్యాయి. ఇంక ప్రభాస్ (Prabhas) తో ముందు 'ఛత్రపతి' (Chatrapathi) సినిమా తీసాడు రాజమౌళి, దాని తరువాత వచ్చిన ప్రభాస్ సినిమా 'పౌర్ణమి' (Pournami) పోయింది. అంతవరకు ఎం.ఎస్. రాజు (MS Raju) సినిమాలన్నీ హిట్ అవుతూ వచ్చాయి, 'పౌర్ణమి' ఫెయిల్యూర్ తరువాత ఎం.ఎస్. రాజు తదుపరి సినిమాల మీద ఆ ప్రభావం బాగా పడింది. అలాగే 'బాహుబలి' (Bahubali) రెండు పార్టులు తీసాడు ప్రభాస్ తో మళ్ళీ, కానీ దాని తరువాత వచ్చిన ప్రభాస్ సినిమా 'సాహో' (Saho) పోయింది. ఇలా ఏ నటుడితో రాజమౌళి సినిమా తీసిన, ఆ నటుడి తదుపరి సినిమా ప్లాప్ అవుతూ వస్తోంది ఇంతవరకు.

ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా వచ్చింది, అవార్డులు గెలుచుకుంది, డబ్బులు కూడా బాగా వచ్చాయి. అయితే ఈ సినిమాలో చేసిన ఇద్దరు అగ్ర నటులు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు వేరే వేరే సినిమాలు చేసుకుంటున్నారు. ఆసక్తికరం ఏంటంటే ఇద్దరూ అగ్ర దర్శకులతో పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. రెండూ హై బడ్జెట్ సినిమాలే. రామ్ చరణ్, దర్శకుడు శంకర్ (Shankar) తో 'గేమ్ చేంజర్' (Game Changer) సినిమా షూటింగ్ లో వుంది, అలాగే ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలెట్టారు.

మరి ఈ ఇద్దరు నటులు ఈ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా? చెయ్యగలరా? ఒకవేళ ఇద్దరూ చేస్తే మాత్రం అది చాలా సంతోషదాయకం అవుతుంది. ఇప్పుడు వాళ్లిద్దరూ చేస్తున్న సినిమాలకి రాజమౌళికి ఎటువంటి సంబంధం లేదు, అలాగే రాజమౌళి కూడా ఏమి చెయ్యలేడు ఈ సినిమాలు ఫలితం ఎలా వున్నా. కానీ ఈ ఇద్దరు నటుల తో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి కొంచెం గుబులుగానే ఉంటుంది. పరిశ్రమ అంటేనే సెంటిమెంట్. మరి ఈ సెంటిమెంట్ ని ఈ ఇద్దరు అగ్ర నటులు బ్రేక్ చేస్తారని ఆశిద్దాం. రెండు సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.

Updated Date - 2023-03-29T12:30:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!