సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..

ABN, First Publish Date - 2023-04-07T12:48:23+05:30

సరైన కంటెంట్ ఉంటే చిన్న సినిమారకి కూడా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందిస్తారని ఎన్నో సినిమాలు రుజువు చేశారు.

Balagam
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరైన కంటెంట్ ఉంటే చిన్న సినిమారకి కూడా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందిస్తారని ఎన్నో సినిమాలు రుజువు చేశారు. ఆ కోవాలోనే విజయం సాధించిన చిత్రం ‘బలగం’ (Balagam). దాదాపు అందరూ కొత్తవారే నటించిన ఈ చిత్రానికి మంచి సక్సెస్ అందించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి టిల్లు వేణు దర్శకత్వం వహించగా.. ప్రియదర్శి (Priyadarsi), కావ్య (Kavya) హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే.. ఈ సినిమా స్థాయి తెలుగు రాష్ట్రాల్లోనే ఆగిపోలేదు. అంతర్జాతీయ స్థాయికి చేరింది.

‘బలగం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ హవా కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం తాజాగా ‘అరౌండ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ - ఆమ్‌స్టర్‌డామ్‌’లో మరో అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు (Venu) ఈ అవార్డును అందుకున్నాడు. చైనా, యూఎస్‌ వంటి పలు దేశాలకు చెందిన చిత్రాలను దాటి మరీ వేణు ఈ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. దీంతో వేణు ఆనందానికి అవధులు లేవు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి వచ్చిన అవార్డుల లిస్ట్ షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. (Balagam wins Around international award)

వేణు షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘‘బలగం’ సినిమాకి గానూ వేణు యేల్దండి (Venu yeldandi) ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నాడని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ఈ అవార్డులకి సంబంధించిన విజేతల జాబితాకి సంబంధించిన పిక్‌ని వేణు షేర్ చేశాడు. కాగా.. ‘వాషింగ్టన్‌ డీసీ ఇంటర్నేషనల్‌ సినిమా ఫెస్టివల్‌’, ‘ఒనికో ఫిల్మ్‌ అవార్డు’ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న ‘బలగం’ ఖాతాలో తాజా అవార్డుతో మొత్తం 9 అవార్డులు చేరాయి. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. వేణుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే.. కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది ఈ చిత్రాన్ని చూసిన పలువురు నెటజన్లు సైతం చాలా సహజంగా ఈ మూవీని తెరకెక్కించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి - సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమాని దర్శకుడు వేణు తెరకెక్కించాడు. కుటుంబానికి చెందిన పెద్ద చనిపోయిన తర్వాత ఆయన పిండాన్ని పిట్ట ముట్టకపోవడం గురించి కథని గుండెలకు హత్తుకునేలా నడిపించాడు. కుటుంబ విలువలు, రక్త సంబంధం గురించి మనసుకి హత్తుకునేలా చూపించాడు.


ఇవి కూడా చదవండి:

SS Rajamouli: కీరవాణిని చూసి గర్వంగా ఫీలవుతున్న రాజమౌళి.. ఈసారి ఆస్కార్ గురించి కాదులెండి..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-07T13:00:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!