Pushpa 2: అడవి నుండి సిటీ కి, మళ్ళీ అడవికి పరిగెడుతున్న సుకుమార్
ABN, First Publish Date - 2023-05-17T15:04:29+05:30
దర్శకుడు సుకుమార్ 'పుష్ప 2' ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఎంతో తపన పడుతున్నాడు. ఎండలను సైతం లెక్కచెయ్యకుండా అటు మారేడుమిల్లి, ఇటు హైదరాబాద్ ఇంకా వేరే లొకేషన్స్ కి అలుపెరుగకుండా తిరుగుతున్నాడు
దర్శకుడు సుకుమార్ (Sukumar) ఎండలను లెక్కచెయ్యకుండా 'పుష్ప 2' (Pushpa 2) సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు అని తెలిసింది. నిన్నటి వరకు మారేడుమిల్లి (MaredumilliForest) ఫారెస్ట్ కి దగ్గరలో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), బ్రహ్మాజీ (Brahmaji) మరికొందరిమీద వారం రోజుల పాటు షూటింగ్ చేసాడని తెలిసింది. అయితే ఈ షూటింగ్ లో కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) లేడని కూడా తెలిసింది. ఎందుకంటే ఈ సన్నివేశాలు అన్నీ పోలీస్ ఆఫీసర్ గా వేసిన ఫహాద్ ఫాజిల్, మిగతా పోలీస్ వాళ్ళతో పాటు మరికొంత మంది ఆర్టిస్టులమీద చిత్రీకరించినట్టుగా తెలిసింది.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో పుష్ప (Pushpa) ఎక్కడా కనిపించడు, ఎక్కడికి వెళ్ళాడు అనే పాయింట్ వుంది కాదా. ఇప్పుడు షూట్ చేసిన సన్నివేశాలు కూడా దానికి సంబంధించినవే అని తెలిసింది. పుష్ప ఎక్కడున్నాడు అని ఫహాద్ ఫాజిల్ నాయకత్వంలోని పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేసిన సన్నివేశాలు సుకుమార్ చిత్రీకరించినట్టుగా తెలిసింది.
ఇక వారం రోజులు అక్కడ చిత్రీకరించక, హైదరాబాద్ చేరుకున్న సుకుమార్, రేపటి నుండి రామోజీ ఫిలిం (RamojiFilmCity) సిటీ లో అల్లు అర్జున్ మీద ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. థాయిలాండ్ నుండి వచ్చిన సాంకేంతిక నిపుణుల ఆధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారని తెలిసింది. సుమారు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఆర్.ఎఫ్.సి (RFC) లో షూటింగ్ ఉండొచ్చని అంటున్నారు. తరువాత మళ్ళీ సుకుమార్ మారేడుమిల్లికి వెళతాడని తెలిసింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఆ తరువాత మళ్ళీ హైదరాబాద్ లో పెద్ద షెడ్యూల్ ఉంటుందని కూడా అంటున్నారు. సుకుమార్ ఇటు, అటు, గ్యాప్ లేకుండా పరిగెడుతూ ఎండలను సైతం లెక్క చెయ్యకుండా ట్రావెల్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రేక్షకుల్లో ఈ 'పుష్ప 2' మీద చాలా అంచనాలు వున్నాయి, అవి అందుకోవాలంటే బాగా కష్టపడాలని యూనిట్ సబ్యులకు సుకుమార్ చెప్పినట్టు కూడా తెలిసింది.