కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hanu Man: మొద‌లెట్టిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ఇకపై ప్ర‌తి మంగ‌ళ‌వారం?

ABN, First Publish Date - 2023-11-08T11:03:03+05:30

ఆ, క‌ల్కి, జాంబీరెడ్డి చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్‌వ‌ర్మ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ చిత్రం ‘హ‌నుమాన్‌’. పాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి విడుద‌లకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు తెర‌లేపింది.

Hanu Man

ఆ, క‌ల్కి, జాంబీరెడ్డి చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్‌వ‌ర్మ(Prasanth Varma) తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ చిత్రం ‘హ‌నుమాన్‌’(Hanu Man). పాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మై రెండు సంవ‌త్స‌రాలు అయింది. సూప‌ర్ హీరో క‌థ‌తో వ‌స్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల చేసిన గ్లిమ్స్ చిత్రంపై వీప‌రీత‌మైన క్రేజ్ తీసుకువ‌చ్చి పెట్టడంతో మేక‌ర్స్ చాలా స‌మ‌యం కేటాయించి గ్రాఫిక్స్ వ‌ర్క్ పూర్తి చేశారు.

అయితే ఈ సినిమా 2024 సంక్రాంతి విడుద‌లకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు తెర‌లేపింది. ఈ విష‌య‌మై ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌నుమాన్ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాలను ఈ మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్‌7) మొద‌లు పెట్టామ‌ని ఇక సినిమా విడుద‌ల అయ్యేంత వ‌ర‌కు ప్ర‌తి మంగ‌ళ‌వారం ఓ ఇంట్రెస్టింగ్ ఆప్డెట్ ఇస్తామంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.


తెలుగులో ఫ‌స్ట్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌గా వ‌స్తున్న ఈ ‘హ‌నుమాన్’ చిత్రంలో తేజ స‌జ్జ‌(teja sajja), అమృత అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా, నిరంజ‌న్ రెడ్డి, పెన్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తుండగా దేశ వ్యప్తంగా 11 భాషల్లో విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా ట్రైల‌ర్‌ క‌న్నా 100 రెట్లు బావుందంటూ సినీ అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు రాగా హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ‘ఛాలీసా’ మిలియ‌న్ల వ్యూస్ సాధించింది.

Updated Date - 2023-11-08T11:10:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!