Director Palik: ఈ డైరెక్టర్ అంటే నిర్మాతకి ఎంత నమ్మకమో.. వెంటవెంటనే రెండు సినిమాలు
ABN, First Publish Date - 2023-09-11T19:27:54+05:30
పాలిక్ దర్శకత్వంలో బియస్‌ఆర్‌కె క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ప్రొడక్షన్ నెం-2 చిత్రాన్ని సోమవారం ఫిలింనంగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. భోగి సుధాకర్, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు.
కొరియోగ్రాఫర్‌గా పేరున్న పాలిక్ (Palik) దర్శకుడిగా మారి చేస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’ (Roudra Rupaya Namaha). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా.. వెంటనే మరో సినిమా సేమ్ బ్యానర్‌లో ప్రారంభోత్సవం జరుపుకుంది. పాలిక్ దర్శకత్వంలో బియస్‌ఆర్‌కె క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ప్రొడక్షన్ నెం-2 చిత్రాన్ని సోమవారం ఫిలింనంగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. భోగి సుధాకర్, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ యూనిట్‌కు స్క్రిప్ట్ అందించగా.. దర్శకుడు, నటుడు గూడ రామకృష్ణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. (BSRK Creations Production No 2 Film Launch)
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత రావుల రమేష్ (Ravula Ramesh) మాట్లాడుతూ.. ఇప్పటికే పాలిక్ దర్శకత్వంలో ‘రౌద్ర రూపాయ నమః’ అనే చిత్రం నిర్మించాను. సినిమా షూటింగ్ పూర్తయింది.. అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక ఆయన దర్శకత్వంలోనే ప్రొడక్షన్ నెం-2 చిత్రం ప్రారంభించాము. ఇదొక పీరియాడికల్ ఫిలిం. ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయి. మిత్రుడు సుధాకర్ గారితో కలిసి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నానని తెలపగా.. మరో నిర్మాత భోగి సుధాకర్ (Bhogi Sudhakar) మాట్లాడుతూ.. నేను టీచర్‌ని, కథారచయితని. ఒక మంచి కథ రాసుకుని సినిమా చేద్దామని అనుకుంటున్న సమయంలో పాలిక్‌ని కలవడం జరిగింది. నా దగ్గర ఉన్న కథ వినిపించాను. తనకు బాగా నచ్చింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఓ కథ చెప్పాడు. ఈ కథ కూడా నాకు విపరీతంగా నచ్చడంతో ముందు ఈ సినిమా చేసి తర్వాత నా కథతో సినిమా చేద్దాం అనుకున్నాం. అతను చెప్పిన కథకు సంబంధించిన చిత్రాన్నే ప్రారంభించాం. ఈ చిత్రాన్ని నా చిన్ననాటి మిత్రుడైన రావుల రమేష్‌తో కలిసి నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ... నిర్మాతే నాకు దేవుడు. కరోనా సమయంలో ఎలాంటి అవకాశాలు లేని సమయంలో నిర్మాత రావుల రమేష్ నాతో ‘రౌద్ర రూపాయ నమః’ సినిమా నిర్మించారు. అది చాలా బాగొచ్చింది. ఇది రెండో సినిమా. నా మీద, నా కథ మీద నమ్మకంతో అవకాశం కల్పించారు. అలాగే మా ఊరి వాస్తవ్యులు, ఎంతో సుపరిచితులైన సుధాకర్ దీనికి మరో నిర్మాత. ఇలా ఇద్దరూ కలిసి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. కరోనాకి ముందు వెంచపల్లి చిత్రాన్ని ప్రారంభించాం. ఆ సమయంలోనే ‘కాంతార’ (Kantara) సినిమా వచ్చింది. మా కథ కూడా ‘కాంతార’ చిత్ర కథకి దగ్గరగా ఉండటంతో కథలో మార్పులు చేసి మళ్లీ కొత్తగా ఈ సినిమా ప్రారంభిస్తున్నాం. ఇందులో కొత్త, పాత నటీనటులు నటిస్తున్నారు. నా ప్రతి సినిమా ద్వారా కొత్త వారిని పరిచయం చేస్తాను. ఇది 1960-1980 మధ్య తెలంగాణలో జరిగిన యథార్థ కథను ఆధారంగా తెరకెక్కించే పీరియాడిక్ మూవీ ఇది. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలుంటాయి. నాలుగు షెడ్యూల్స్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
============================
*Samyuktha Menon: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు
***********************************
*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?
**********************************
*Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’
**********************************
*Jithender Reddy: దర్శకుడు విరించి వర్మ తదుపరి చిత్రమిదే.. టైటిల్ లుక్ విడుదల
**********************************
*Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత.. ఆనంద్ రూట్ మార్చాడు.. ఈసారి మాస్ బొమ్మతో..
*********************************