సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Waltair Veerayya: అందుకే రవితేజని తీసుకున్నాం..సినిమా ఆసక్తికరమైన విషయాలు....

ABN, First Publish Date - 2023-01-07T18:55:53+05:30

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya). మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja) కీలక పాత్ర పోషించారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) తెరకెక్కించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya). మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja) కీలక పాత్ర పోషించారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ కొల్లి మీడియాతో మాట్లాడారు. 'వాల్తేరు వీరయ్య' విశేషాలని పంచుకున్నారు.

సంక్రాంతికి భారీ పోటీ ఉంది కదా.. ఒత్తిడి అనిపిస్తుందా ?

అదేంలేదండీ. వేరే నిర్మాతలు అయితే ఒత్తిడి ఉండొచ్చేమో..కానీ, రెండు సినిమాల నిర్మాతలు ఒకరే కాబట్టి రెండింటి ఫలితాలు బాగుండాలని ఎదురుచుస్తున్నాం.

'వాల్తేరు వీరయ్య' బ్యాక్ స్టొరీ చెప్పండి ?

'వాల్తేరు వీరయ్య’ గురించి చెప్పాలంటే ముందు నా బ్యాక్ స్టొరీ చెప్పాలి. నేను చిరంజీవి అభిమానిగా 2003లో నా ప్రయాణం మొదలుపెట్టాను. ఆయన సినిమాలో పని చేయాలనే ఒక కల వుండేది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసిన చిత్రం 2023లో విడుదల అవుతుంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది.

చిరంజీవితో సినిమా అనేసరికి కచ్చితంగా హిట్టు కొట్టాలనే ఒత్తిడి ఉందా ?

లేదండీ. మెగాస్టార్ ఎన్నో విజయాలు, అపజయాలు చూసుంటారు. ఆయనకి ఉన్నంత బ్యాలెన్స్ ఎవరికీ ఉండదని కూడా చెప్పొచ్చు. ఆ విధంగానే రవితేజ కూడా. ఒక సినిమాకి పడాల్సినంత కష్టం సర్వస్వం పెడతారు. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని బలంగా నమ్ముతారు.

'వాల్తేరు వీరయ్య' కోసం అందరూ అభిమానిలా పని చేశాం అని చెప్పారు.. ఇలా చేయడం వలన రెగ్యులర్ ఆడియన్స్‌ని మర్చిపొతున్నామనే భావన కలుగుతుంది కదా ?

నిజానికి ఈ కథ లాక్‌డౌన్‌కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చెప్పాను. అయితే లాక్‌డౌన్‌లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీల్లోని డిఫరెంట్ కంటెంట్‌కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని చూశాం. అందులో నుంచి వచ్చిన పాత్రే రవితేజది. ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ చూస్తూ స్టోరీని డిజైన్ చేశాను. బీ, సీ సెంటర్ ఆడియన్స్‌తో పాటు మల్టీ‌ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని లక్షణాలు వాల్తేరు వీరయ్యలో ఉంటాయి.

చిరంజీవి, రవితేజ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది.. ? వాల్తేరు వీరయ్య కథ ఏమిటి.. ?

ప్రతి సీన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. కలర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న చిత్రం వాల్తేరు వీరయ్య.

వాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టడానికి కారణం.. ?

యాగంటిలో 'వెంకీ మామ' షూటింగ్ జరుగుతున్నపుడు నాజర్ ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్‌తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల‌లో ఉన్నప్పుడు ఆయన నాన్న దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్‌గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవికీ కూడా నచ్చింది. ఆ విధంగా వాల్తేరు వీరయ్య టైటిల్‌ని లాక్ చేశాం.

వాల్తేరు వీరయ్యలో రవితేజది అతిథి పాత్రనా ?

ప్రస్తుతం ఆ విషయం చెప్పను. సినిమాను 13వ తేదిన చూడగానే మీకు తెలుస్తుంది. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య సినిమా లేదని మాత్రం చెప్పగలను.

రవితేజ ఛాయిస్ ఎవరిది ?

రవితేజ ఛాయిస్ నాదే. ఆయనను తీసుకోవాలనే ఆలోచన నాకే వచ్చింది. చిరంజీవి కూడా మరో ఆలోచన లేకుండా ఓకే అనడంతో రవిని సంప్రదించాం. చిరంజీవి‌పై ఉన్న ప్రేమ అభిమానం, నాపై ఉన్న నమ్మకంతో వాల్తేరు వీరయ్యని చేయడానికి రవితేజ అంగీకరించారు.

ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తున్నపుడు అభిమానుల విషయంలో ఒత్తిడి ఉంటుందా ?

వాల్తేరు వీరయ్య సినిమాలో నాకున్న సౌలభ్యం ఏమిటంటే చిరంజీవి ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ ఒకటే. చిరంజీవి‌ని అభిమానించే ఫ్యాన్స్ రవితేజను కూడా ఎంతగానో అభిమానిస్తారు. గతంలో ఎన్నో సార్లు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగానని రవితేజ చెప్పారు. ఫ్యాన్స్ అందరూ ఇద్దరినీ ఒకేలా ప్రేమిస్తారని మా నమ్మకం.

దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?

చిరంజీవి, దేవిశ్రీ ది హిట్ కాంబినేషన్. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్‌కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియోనే. ఆ విధంగా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్‌కీ మా టీం తరపున కృతజ్ఞతలు.

ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారి గురించి ?

ఏఎస్ ప్రకాష్ గారు ఒక సీనియర్ ఆర్ట్ డైరెక్టర్. ఆయనకి మనం ఇన్‌పుట్స్ ఇవ్వడానికి పెద్ద హోం వర్క్ అవసరం లేదు. కథ చెప్పినప్పుడే వరల్డ్ మొత్తాన్ని అర్థం చేసుకుంటారు. బాస్ పార్టీ సాంగ్ ఒక జాలరీ పేట షిప్‌యార్డ్ కల్చర్‌లో ఉండాలి. ఆయన అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి ?

మైత్రీ మూవీ మేకర్స్‌తో కలసి పని చేయాలని ఎప్పటినుంచో ఉండేది. సినిమా చేద్దామని గతంలోనే నవీన్ అడిగారు. ఆ తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో రాజీ పడకుండా అన్ని సమకూరుస్తారు.

'వాల్తేరు వీరయ్య'కి సీక్వెల్ ఉంటుందా ?

ఇప్పటికైతే లేదు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల కోరికను బట్టి ఆ దిశగా ఆలోచిస్తాం.

వాల్తేరు వీరయ్య హిందీ రిలీజ్ గురించి చెప్పండి ?

చిరంజీవి, రవితేజ ఇద్దరికీ హిందీలో మంచి మార్కెట్ వుంది. ఈ ఇద్దరు హీరోలు అక్కడి ఆడియన్స్‌కి చాలా ఇష్టం. వాల్తేరు వీరయ్య తెలుగుతో పాటు హిందీలోను ఒకేసారి విడుదల కానుంది.

పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచన ఉందా ?

పాన్ ఇండియా అనేది రాజమౌళి మనకి ఇచ్చిన అద్భుతమైన ఫ్లాట్‌ఫామ్. అలాంటి కథ దొరికితే నేను కూడా తప్పకుండా చేయాలని అనుకుంటాను.

Updated Date - 2023-01-07T19:02:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!