Harish Shankar : ప్రపంచం తెలుగు సినిమా వైపు చూస్తోంది.. తక్కువ చేయొద్దు!
ABN, First Publish Date - 2023-05-25T12:37:49+05:30
‘చులకన చేసే నోరు ఉన్నప్పుడు... (Harish Shankar Counter) చురకలు వేసే నోరు కూడా ఉంటుంది. తెలుగు సినిమా ఉన్నత స్థాయిలో ఉందిప్పుడు. దానిని అవమానిస్తే చూస్తూ ఊరుకోలేం. మన పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడొద్దు. ఏ భాషాలో తీసిన చిత్రమైన నచ్చితే ఆ సినిమాను, మేకర్‌ను ప్రశంసించండి. దాని ముందు మన పరిశ్రమను తక్కువ చేయొద్దు’’ అని హరీశ్ శంకర్ అన్నారు.
‘‘చులకన చేసే నోరు ఉన్నప్పుడు... (Harish Shankar Counter) చురకలు వేసే నోరు కూడా ఉంటుంది. తెలుగు సినిమా ఉన్నత స్థాయిలో ఉందిప్పుడు. దానిని అవమానిస్తే చూస్తూ ఊరుకోలేం. మన పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడొద్దు. ఏ భాషాలో తీసిన చిత్రమైన నచ్చితే ఆ సినిమాను, మేకర్‌ను ప్రశంసించండి. దాని ముందు మన పరిశ్రమను తక్కువ చేయొద్దు’’ అని హరీశ్ శంకర్ అన్నారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందుకు కారణం. ఓ విలేకరి అడిగిన ప్రశ్న. మలయాళంలో హిట్టైన ‘2018’ (2018 Film) చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హరీశ్ శంకర్ పాల్గొన్నారు. క్యూ అండ్ ఏ సెషన్‌లో ఓ విలేకరి ‘‘2018’ సినిమా చూసిన తర్వాత తెలుగు దర్శకులు ఇలాంటి ప్రాజెక్ట్ చేసే సాహసం చేయగలరా? అని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత బన్నీ వాసుని అడిగారు. దీనికి దర్శకులే జవాబు చెబితే బావుంటుందని అని ఆ ప్రశ్నను దర్శకుడు హరీశ్ శంకర్‌కు (harish shankar)పాస్ చేశారు.
‘‘ఈ మధ్యకాలంలో ఓ జర్నలిస్ట్ ఎవరూ అడగని ప్రశ్నలు సాహసోపేతంగా అడిగి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచి.. యూట్యూబ్‌లో ఒక ట్రెండ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ సినిమా మన చేతికి వచ్చేసింది. గొప్ప టెక్నాలజీలో మనం ఉన్నాం. ‘2018’ను అనువాద చిత్రం అని అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి’ చిత్రాలను హిందీలో ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా..! డబ్బింగ్ లేదా రీమేక్ సినిమా అనేది లేదు. కేవలం సినిమా అంతే. నేటి రోజుల్లో సినిమా ఎక్కడికైనా వెళ్తున్నందుకు మనం ఎంతో సంతోషించాలి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఇలాంటి ప్రశ్న వేశారంటే జాలిగా ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు దర్శకుల వైపు చూస్తోంది. ఆయన కేరళ దర్శకుడని నేను ఈ సినిమా చూడలేదు. ఆయన వర్క్ నాకెంతో నచ్చింది. సినిమాలో ఒక ఎమోషన్ ఉంది అది నచ్చి ప్రశంసించాలని వచ్చా. ‘గీతాఆర్ట్స్’ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు? వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు బన్నీవాసుతో నేనే రిలీజ్ చేయిస్తా. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాని పది మందికి చూపించాలని చేేస ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఈ సినిమాని ముందు మీకే చూపించాలని బన్నీ వాసు అనుకున్నారు. ఎందుకంటే సినిమా మీకు నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్ నిర్మాత కూడా చేయలేరు. డబ్బింగ్ లేదా రీమేక్ అనేది విషయం కాదు. మంచి సినిమాలు చేస్తున్నామా? లేదా? అనేది ముఖ్యం’ అని అన్నారు.