Dimple lawyer: డింపుల్ కేస్.. లాయర్ ఏమన్నారంటే!
ABN, First Publish Date - 2023-05-25T16:30:47+05:30
డింపుల్ హయాతీ (Dimple Hayathi) వర్సెస్ డీసీపీ (DCP Rahul Hegde) ఇప్పుడు ఇదే టాపిక్ హల్‌చల్ చేస్తోంది. ఇంటి పార్కింగ్ ప్లేస్‌లో చెలరేగిన వివాదం వ్యక్తిగత ఆరోపణల వరకూ వెళ్లింది. రోడ్డుపై ఉండాల్సిన ట్రాఫిక్ దిమ్మెలు అపార్ట్‌మెంట్‌లో ఉండటంపై విమర్శలొస్తున్నాయి.
డింపుల్ హయాతీ (Dimple Hayathi) వర్సెస్ డీసీపీ (DCP Rahul Hegde) ఇప్పుడు ఇదే టాపిక్ హల్‌చల్ చేస్తోంది. ఇంటి పార్కింగ్ ప్లేస్‌లో చెలరేగిన వివాదం వ్యక్తిగత ఆరోపణల వరకూ వెళ్లింది. రోడ్డుపై ఉండాల్సిన ట్రాఫిక్ దిమ్మెలు అపార్ట్‌మెంట్‌లో ఉండటంపై విమర్శలొస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లో చిన్న గొడవగా మొదలై పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. డింపుల్ మరో అడుగు ముందుకేసి డీసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనను వేధిస్తున్నారని న్యాయ పోరాటానికి సిద్థమైంది. డింపుల్ మీద పెట్టిన కేస్ ఎఫ్‌ఐఆర్ కాపీ అందిందని ఆమె తరఫు లాయర్ పాల్ సత్యనారాయణ తెలిపారు. కారు కవర్ తీసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారని.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలని న్యాయవాది కోరారు. పోలీస్‌లు అసలు సీసీటీవీ ఫుటేజ్ తీయలేదని ఆరోపించారు. ఈ కేసుపై ఇప్పటిదాకా డీసీపీ మాట్లాడుతున్నారు కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడటం లేదని డింపుల్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ట్రాఫిక్ అయి ఉండి తోటి ఆడపిల్లకి ఇబ్బందిగా ఉన్నప్పుడు అతను కానీ తన సిబ్బంది గానీ సహకరించాలే తప్ప ఇలా చేయడం కరెక్ట్ కాదని పాల్ సత్యనారాయణ అన్నారు. డీసీపీ తనను తాను రక్షించుకోవడం కోసం కామన్‌సెన్స్ లేకుండా బీహేవ్ చేస్తున్నాడని ఆయన విమర్శించారు. పోలీస్ అయితే భయపడాల్సిన పని లేదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా డీసీపీకే ఫేవర్‌గా ఉన్నారనీ, ఆ స్టేషన్‌పై భరోసా లేదని, అందుకే న్యాయ పోరాటం చేయడానికి సిదఽ్ధంగా ఉన్నామని తెలిపారు. డీసీపీ బీహేవియర్ వల్ల డింపుల్ డిప్రెషన్‌లో ఉందని, ఇప్పుడు ఆమె మీడియా ముందుకురాదని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి వద్ద సంచరిస్తున్నారని పేర్కొన్నారు. డింపుల్‌కు ప్రాణ హాని ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు లాయర్ సత్యనారాయణ(Lawyer satyanarayana).