సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mechanic: ‘మెకానిక్’కు దిల్ రాజు సపోర్ట్

ABN, First Publish Date - 2023-02-17T18:55:06+05:30

టీనా శ్రీ క్రియేషన్స్ (Teena Sree Creations) పతాకంపై మున్నా (ఎమ్. నాగ మునెయ్య) (Munna) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్

Producer Dil Raju
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీనా శ్రీ క్రియేషన్స్ (Teena Sree Creations) పతాకంపై మున్నా (ఎమ్. నాగ మునెయ్య) (Munna) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్ నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న ‘మెకానిక్’ (Mechanic) చిత్రానికి సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ అందిస్తున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గ్రామీణ నేపథ్యంలో.. నేటి సమాజంలోని ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీట వేస్తూ సందేశాత్మక చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో ముని సహేకర (Muni Sahekara) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ట్రబుల్ షూటర్’ (Trouble Shooter) అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను నిర్మాత దిల్ రాజు (Dil Raju) చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మణిసాయితేజ (Mani Saiteja) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖనిరోషా (Rekha Nirosha) హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుందని.. త్వరలోనే మోషన్ పోస్టర్‌ని విడుదల చేయనున్నామని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య (Vinod Yajamanya) సంగీతం అందిస్తున్నారు. (Mechanic Motion Poster Launch details)

Updated Date - 2023-02-17T18:55:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!