కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dil raju : అయన పాడిన పాట ఏంటో తెలుసా?

ABN, First Publish Date - 2023-12-12T16:44:29+05:30

కొత్త టాలెంట్స్‌ని ప్రోత్సహించడంలో నిర్మాత దిల్‌ రాజు (Dil raju) ఎప్పుడూ ముందుంటారు. దిల్‌ రాజులో నిర్మాత మాత్రమే కాదు. మరో టాలెంట్‌ కూడా  ఉంది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో ఏదో ఒక పాత్రలో తళుక్కున మెరుస్తారు. ఆయనలో నటుడు కూడా ఉన్నారని నిరూపించుకున్నారు

కొత్త టాలెంట్స్‌ని ప్రోత్సహించడంలో నిర్మాత దిల్‌ రాజు (Dil raju) ఎప్పుడూ ముందుంటారు. దిల్‌ రాజులో నిర్మాత మాత్రమే కాదు. మరో టాలెంట్‌ కూడా  ఉంది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో ఏదో ఒక పాత్రలో తళుక్కున మెరుస్తారు. ఆయనలో నటుడు కూడా ఉన్నారని నిరూపించుకున్నారు. అంతే కాదు ఆయనలో మనకు తెలియని మరో టాలెంట్‌ కూడా ఉంది. అదే సింగింగ్‌. అవును.. మంచి మంచి పాటగాడు కూడా. అయితే ఆయన ఓ సినిమాలో పాట పాడారనే విషయం పెద్దగా ఎవరికీ తెలీదు. అక్కినేని నాగచైతన్య వెండితెరకు పరిచయం అయిన జోష్‌. వాసువర్మ దర్శకుడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.  అసలీ చిత్రానికి తొలుత హీరోగా రామ్‌చరణ్‌ను అనుకున్నారట. కానీ అది కుదరలేదు. ఈ కథను నాగార్జున వినడం, నాగచైతన్య (Naga chaitanya) హీరోగా వెండితెరకు పరిచయం కావడం జరిగాయి. అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న హీరో కావడంతో దిల్‌ రాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

సందీప్‌ చౌతా (Sandeep Choutha) సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అయితే ఇందులో ఓ పాటను దిల్‌ రాజు పాడారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ‘అన్నయొచ్చినాడో.. వెలుగులు వెన్నెల్‌ తెచ్చినాడో..’ పాటను దిల్‌రాజు స్వయంగా పాడటం విశేషం. ఈ పాట లిరిక్స్‌ వచ్చిన తర్వాత అవి సరిగా ఉన్నయో లేదో చూసుకుంటూ దిల్‌ రాజు హమ్‌ చేస్తుండటంతో అది విన్న వాసువర్మ పట్టుబట్టి మరీ ఆయనతోనే ఈ పాట పాడించారు. తాజాగా ఈ విషయం ఓ ఇంటర్వూ ద్వారా బయటకు వచ్చింది. ప్రస్తుతం దిల్‌ రాజు రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ుగేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2023-12-12T16:44:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!