సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karna Trailer: చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం

ABN, First Publish Date - 2023-06-15T20:21:46+05:30

యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కర్ణ’. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా కూడా ఆయనే నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Karna Movie Pic
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కర్ణ’ (Karna). సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ (Kaladhar Kokkonda) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా కూడా ఆయనే నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం దిల్ రాజు (Dil Raju).. ట్రైలర్ చాలా బాగుందని చెబుతూ.. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ విషయానికి వస్తే (Karna Trailer Talk).. యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే లైన్స్ షో చేస్తూ మొదలు పెట్టిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్‌లో మూవీ సోల్ తెలిసేలా సన్నివేశాలు కట్ చేశారు. ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారనేది మాత్రం అర్థమవుతోంది. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, అందులో ఓ ప్రేమకథ ఇందులో చూడవచ్చేనేది ఈ ట్రైలర్ స్పష్టం చేసింది. డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముఖ్యానికి ‘చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం’ అనే డైలాగ్‌తో పాటు ఉత్కంఠ రేపే సీన్స్ చూపిస్తూ ఈ ట్రైలర్ క్లోజ్ చేశారు. చివరలో సెంటిమెంట్ సీన్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. (Karna Trailer Out)

కళాధర్ కొక్కొండ సరసన మోనా ఠాకూర్ (Mona Thakur) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. రీసెంట్‌గా ఈ సినిమాలోని ‘గుడి ఎనక నా సామీ’ పాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) విడుదల చేయగా.. ఆ పాట ప్రేక్షకాదరణ పొందింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ‘కర్ణ’ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లుగా మేకర్స్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..


**************************************

*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!

**************************************

*SJ Suryah: అమితాబ్ బచ్చన్‌ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..


**************************************

*Urvashi: విలేకరులారా.. తప్పకుండా ఆ ప్రశ్న అడగండి


**************************************

*Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..

**************************************

Updated Date - 2023-06-15T20:21:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!