Film Chamber Winner: ఓట్ల లెక్కింపు పూర్తి.. విజయం ఎవరిదంటే!
ABN, First Publish Date - 2023-07-30T18:39:46+05:30
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil raju) గెలుపొందారు. సి.కల్యాణ్‌కు, దిల్ రాజు ప్యానళ్లకు మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో దిల్‌రాజు విజయం సాధించారు. నిర్మాతల సెక్టార్‌లో మొత్తం 891 ఓట్లు పోల్ కాగా, 563 ఓట్లను దిల్ రాజు పొందారు.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil raju) గెలుపొందారు. సి.కల్యాణ్‌కు, దిల్ రాజు ప్యానళ్లకు మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో దిల్‌రాజు విజయం సాధించారు. నిర్మాతల సెక్టార్‌లో మొత్తం 891 ఓట్లు పోల్ కాగా, 563 ఓట్లను దిల్ రాజు పొందారు. అధ్యక్ష పదవి కోసం బరిలో దిగిన మరో నిర్మాత సి.కల్యాణ్ 497 ఓట్లు సొంతం చేసుకుని ఓటమి పాలయ్యారు. స్డూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్‌కు చెందినవారే! (Film chamber elections)
డిస్ర్టిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్ తరపున అటు ఆరుగురు ఇటు ఆరుగురు గెలుపొందారు. దిల్ రాజు ప్యానల్ నుంచి గెలుపొందిన వారిలో దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపట్ల, పద్మిని, స్రవంతి రవికిషోర్, రవి శంకర్ యలమంచిలి ఉన్నారు. ఎగ్జిబిటర్ సెక్టర్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనా వారంతా దిల్ రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. (Dil raju winner)
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్, మాదాల రామకృష్ణ రమేష్ ముత్యాల, ముత్యాల రాందాస్ సత్యనారాయణ అత్తి, అభిషేక్ నామా, ఎం.వెంకటేశ్వరరావు , డి.ఎస్.ఎన్.ప్రసాద్, భరత్ చౌదరి చెరుకూరి, మధుసూదన్ రెడ్డి, బాపిరాజు, సర్వేశ్వర ప్రసాద్ గెలుపొందారు.
ఎవరికీ ఎన్ని సీట్లు వచ్చాయంటే ...
ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)
దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5..
డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)
దిల్ రాజు కి 6, సి కళ్యాణ్ కి 6.
స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ (4)
దిల్ రాజు కి 3, సి కళ్యాణ్ కి 1.
ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)
దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8.
కీలకంగా మారిన సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4).