Dil Raju: కుమారుడితో అల్లరి... వీడియో వైరల్!
ABN, First Publish Date - 2023-07-06T17:15:30+05:30
నిర్మాత దిల్ రాజు తన కుమారుడు అన్వైతో సరదాగా ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల దిల్ రాజు తన కుమారుడు అన్వై మొదటి పుట్టిన రోజు వేడుక ఇటీవల ఘనంగా నిర్వహించిన తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు.
నిర్మాత దిల్ రాజు (Dil raju( తన కుమారుడు అన్వైతో సరదాగా ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల దిల్ రాజు తన కుమారుడు అన్వై మొదటి పుట్టిన రోజు వేడుక ఇటీవల ఘనంగా నిర్వహించిన తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. దిల్ రాజు (Anvay birthda bash) కుటుంబసభ్యులంతా ఉన్న ఆ వీడియోలో కుమారుడితో కలిసి అల్లరి చేశారు. ఈ వీడియో కోసం తమన్ ప్రత్యేకంగా ఓ పాట కంపోజ్ చేయగా సింగర్ కార్తిక్ దాన్ని ఆలపించారు. ఈ వీడియోలో దిల్ రాజ్ కుమారుడిని వీపుపై ఎక్కించుకున్న క్లిప్, అన్వైపై దిల్‌రాజ్ మనవడు (కూతురు బిడ్డ) నీళ్లు పోస్తున్న షాట్ కూడా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట వైరల్ అవుతోంది.
దిల్ రాజు భార్య అనిత మరణించిన తర్వాత ఆయన ఎయిర్ హోస్టెస్ తేజస్వినిని 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి 2022 జూన్ 29న అన్వై పుట్టాడు. ఇటీవల ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన అన్వై మొదటి పుట్టిన రోజు వేడుకలకు చిరంజీవి - సురేఖ దంపతులు, వెంకటేశ్, మహేశ్ బాబు, శ్రీలీల, గోపీచంద్, రాశీ ఖన్నా తదితరులు హాజరై సందడి చేశారు.