సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

ABN, First Publish Date - 2023-04-03T15:28:56+05:30

ఇటీవలికాలంలో ఎక్కడ చూసినా ‘బలగం’ (Balagam) మూవీ పేరే వినిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది.

Balagam
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలికాలంలో ఎక్కడ చూసినా ‘బలగం’ (Balagam) మూవీ పేరే వినిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోలో పాపులారిటీ సాధించిన ప్రముఖ కమెడియన్ టిల్లు వేణు ఈ చిత్రానికి దర్శకుడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి (Priyadasi), కావ్య (Kavya) హీరో హీరోయిన్లుగా నటించారు. తెలంగాణ సంప్రదాయమైన ‘పిట్ట ముట్టుడు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ప్రశంసలు దక్కాయి.

అయితే.. మార్చి 3న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే ఓటీటీ (OTT)లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఈ చిత్రాన్ని మంచి ధరకే ఈ చిత్రాన్ని కొనుక్కుంది. అయితే.. అంత ప్రజాదరణ పొందిన ఈ సినిమాకి సంబంధించి ఓ కేసు నమోదైంది. అయితే.. అది ఫైల్ చేసింది ఎవరో కాదు.. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజే. నిజమాబాద్‌లోని ఓ ఊరిలో పెద్ద తెరలు కట్టి మరీ ఈ చిత్రాన్ని ప్రదర్శించారంట. అందుకే దిల్ రాజ్ నిజమాబాద్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. (Dilraju complaints about Balagam movie)

అందులో.. ‘మార్చి 3న విడుదలైన మా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణ ప్రజల విశ్వాస గురించి తెలిపిన ఈ మూవీకి ప్రశంసలు కూడా దక్కాయి. అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ ఇచ్చేశాం. అందులో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. కొందరు అసాంఘిక శక్తులు ఈ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసి చాలామందికి షేర్ చేస్తున్నారు. దాని వల్ల మా థియేట్రికల్ ఆదాయం తగ్గిపోతోంది. అందుకే అలా గ్రూప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని, మమ్మల్ని భారీ నష్టాలను రక్షించండి’ అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కాపీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘దిల్‌రాజ్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో నిజమాబాద్ జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసినట్లు అందులో ఉంది. (Dilraju complaints about Balagam piracy)

కాగా.. అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ.25 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. అలాగే.. ఓటీటీ రైట్స్‌కి మంచి ఆదాయం రావడంతో సినిమాకి భారీ లాభాలే వచ్చాయని చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

Kangana Ranaut: తనని ట్రోల్ చేయమంటున్న కంగనా.. దేనికోసమంటే..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-03T15:51:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!