సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dil Raju: నిర్మాతల మండలి ఎన్నికలు.. దిల్‌ రాజు కామెంట్స్‌

ABN, First Publish Date - 2023-02-19T23:44:15+05:30

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Telugu producers council Elections) ఎన్నికలు ఆదివారం ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగాయి. రెండేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు నాలుగేళ్ల తర్వాత జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Telugu producers council Elections) ఎన్నికలు ఆదివారం ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగాయి. రెండేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు నాలుగేళ్ల తర్వాత జరిగాయి. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ (దాము) (Damu)ఎలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మండలిలో సభ్యుల శ్రేయస్సే మా లక్ష్యంగా పని చేస్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గిల్డ్‌, కౌన్సిల్‌ వేరు కాదు.. రెండు ఒక్కటే’’ అని చెప్పారు. (Producers council elections)

ఈసీ మెంబర్‌గా గెలుపొందిన నిర్మాత దిల్‌ రాజు (Dil raju) మాట్లాడుతూ ‘‘నిర్మాతల మండలి ఎన్నికలు రెండేళ్లకు జరగాలి. నాలుగేళ్లగా జరగడం లేదు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఈసీ మెంబర్‌గా నన్ను గెలిపించారు. నన్ను వివాదాస్పద వ్యక్తిగా చూస్తారు. కానీ ఈ మెజార్టీని బట్టి నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతోంది. యాక్టవ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో ఉండాలని నేనెప్పుడూ కోరుకున్నాను. ఇప్పుడు అదే జరిగింది. ఈసారి మండలి ఎలక్షన్లు ఏకగ్రీవం కావాలని కోరుకున్నాం. కానీ ఎన్నికలు తప్పలేదు. మేమంతా కలిసి పని చేస్తా’’ అని అన్నారు.

Updated Date - 2023-02-19T23:44:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!