కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dil Raju: సంక్రాంతి సినిమాలు.. దిల్‌ రాజు ఏమన్నారంటే..!

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:46 PM

‘సంక్రాంతికి (Sankranthi movies) సందడి చేయనున్న చిత్రాల్లో ఒకటో, రెండో చిత్రాలు వెనక్కి తగ్గితే మిగతా చిత్రాలకు సరిపడా థియేటర్లు దొరుకుతాయి. ఒకవేళ ఎవరూ తగ్గకపోతే అన్ని చిత్రాలు పండక్కే వస్తాయి. అలా జరిగితే అన్ని సినిమాలకు న్యాయం జరగదు.

‘సంక్రాంతికి (Sankranthi movies) సందడి చేయనున్న చిత్రాల్లో ఒకటో, రెండో చిత్రాలు వెనక్కి తగ్గితే మిగతా చిత్రాలకు సరిపడా థియేటర్లు దొరుకుతాయి. ఒకవేళ ఎవరూ తగ్గకపోతే అన్ని చిత్రాలు పండక్కే వస్తాయి. అలా జరిగితే అన్ని సినిమాలకు న్యాయం జరగదు. కానీ ఏ సినిమా బాగుంటే అదే పండగ తర్వాత కూడా ఆడుతుంది’’ అని దిల్‌ రాజు (Dil raju) అన్నారు. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులతో 1999లో ప్రారంభమైన ‘లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ’(LMA) 25 వసంతాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా జనవరి 21న హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో సిల్వర్‌ జూబ్లీ వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దిల్‌ రాజు అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన సంక్రాంతి సినిమాలపై స్పందించారనిచ్చారు

‘‘మా బ్యానర్‌ నుంచి సంక్రాంతికి రావాల్సిన సినిమాను మార్చికి వాయిదా వేసుకున్నా. మిగతా ఐదుగురిలో ఎవరో ఒక్కరు తగ్గితే వాళ్లకు ఆ తర్వాత ఛాంబర్‌ ద్వారా సోలో డేట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఎవరు వస్తారు.. ఎవరు తగ్గుతారన్నది ఈ రెండు రోజుల్లో స్పష్టత రావొచ్చు. పెద్ద సినిమా ‘గుంటూరు కారం’ పండక్కి విడుదల చేస్తామని నిర్మాతలు ముందుగానే చెప్పారు. కాబట్టి అది యథాతధంగా వచ్చేస్తుంది. మిగిలిన నాలుగు చిత్రాల నిర్మాతల్లో ఎవరైన తగ్గితే బాగుంటుంది. ఒకవేళ వాళ్లలో ఎవరూ తగ్గకపోతే అన్ని సినిమాలు పండగకే విడుదలవుతాయి. అలా జరిగితే అన్ని చిత్రాలకు న్యాయం జరగదు. వ్యక్తిగతంగా ఎవరినీ తప్పుకోమని నేను చెప్పలేదు. నా అనుభవంతో ఐదుగురిలో నుంచి ఒకరిని వెనక్కి తగ్గమని సలహా ఇచ్చా. వెనక్కి వెళ్లే వాళ్లకు అడ్వాంటేజ్‌ ఉంటుంది. అలాగే ఆర్డర్‌లోనే రిలీజ్‌ చేయడంపై ఆంక్షలు కూడా పెట్టలేం. సినిమా అనుకున్న తేదీకి రాకపోతే సరిగా ఆడదేమో.. వసూళ్లు రావేమో అన్నది అపోహ మాత్రమే! సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. దానికి ‘సలార్‌’ మంచి ఉదాహరణ. వాయిదా పడుతూ వచ్చినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది’’ అని దిల్‌ రాజు అన్నారు.

త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున అందరం కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలవబోతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 


Updated Date - Dec 26 , 2023 | 01:46 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!