కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prabhas : ఓటు హక్కు వినియోగించుకున్నాడా?

ABN, First Publish Date - 2023-11-30T20:14:59+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది. రాష్ట్రమంతటా ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. సెల్రబిటీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోమని పిలుపునిచ్చారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఎక్కువమంది సినీ సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) మాత్రం ఏ పోలింగ్ బూత్ లోనూ కనిపించలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది. రాష్ట్రమంతటా ఓటు వేేసందుకు ఆసక్తి చూపించారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్‌ శాతం కాస్త తగ్గింది. మరోవైపు సెల్రబిటీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోమని పిలుపునిచ్చారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఎక్కువమంది సినీ సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) మాత్రం ఏ పోలింగ్ బూత్ లోనూ కనిపించలేదు.

ప్రస్తుతం ఆయన వరుసగా పాన్  ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో ‘సలార్‌’ డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్  చేశారు. ఆ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాలనుకున్నారట. ప్రభాస్‌ కొన్నాళ్ల క్రితం విదేశాల్లో మోకాలి సర్జరీ చేయించుకున్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌కి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బయటకు పెద్దగా రావడం లేదు. అందుకే సలార్‌ ట్రైలర్‌ కూడా ఓ వేదికపై కాకుండా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. విశ్రాంతి వల్లే ఓటు హక్కు వినియోగించుకోలేదని చెబుతున్నారు ఆయన సన్నిహితులు.

మణికొండ హైస్కూల్‌లో ప్రభాస్‌ ఓటు వేయాల్సి ఉంది. ఆయన పీఆర్‌ టీమ్‌ బుధవారమే మణికొండ హైస్కూల్‌లో ఓటు వేయబోతున్నారంటూ తెలియపరిచారు. పోలింగ్‌ పూర్తయ్యే సమయానికైతే ఓటు వేసినట్లు సమాచారం లేదు. నేటి ఉదయం నుంచే చాలామంది సినీ సెలబ్రిటీలు చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్  తదితరులు ఓటు హక్కు వినియోగించుకుని సోషల్‌ మీడియా వేదికగా సంబంధిత ఫొటోలను షేర్‌ చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-11-30T20:15:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!