కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sai tej - Swathi : కాపీ కొట్టాడు.. పాస్‌ అయ్యాడు..!

ABN, First Publish Date - 2023-09-26T17:56:05+05:30

మెగాహీరో సాయిధరమ్‌ తేజ్‌ని కలర్స్‌ స్వాతి ేస్టజీపై ముద్దుపెట్టుకుంది. అయితే ఇప్పటి వరకూ వీరిద్దరూ ఆర్టిస్ట్‌లనే తెలుసు. కలిసి ‘సత్య’ అనే మ్యూజిక్‌ వీడియో చేశారని తెలుసు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ గురించి ఎవరికీ తెలీదు.

మెగాహీరో సాయిధరమ్‌ తేజ్‌ని (Sai tej)కలర్స్‌ స్వాతి స్టేజ్ పై ముద్దుపెట్టుకుంది. అయితే ఇప్పటి వరకూ వీరిద్దరూ ఆర్టిస్ట్‌లనే తెలుసు. కలిసి ‘సత్య’ అనే మ్యూజిక్‌ వీడియో చేశారని తెలుసు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ గురించి ఎవరికీ తెలీదు. పెళ్లి తర్వాత నటనకు గ్యాప్‌ ఇచ్చిన స్వాతి మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. కొన్నాళ్ల ముందే రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. స్వాతి హీరోయిన్‌గా నటించిన ‘మంత్‌ ఆఫ్‌ మధు’ మూవీ అక్టోబరు 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మెగా హీరో తేజ్‌ గురించి స్వాతి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘స్వాతి గురించి చెప్పాలంటే మీ అందరికీ స్వాతి కలర్స్‌ స్వాతిగా తెలుసు. నాకు మాత్రం స్వాతిగాడు. ఎందుకంటే కాలేజీ రోజుల నుంచే స్వాతి నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. కలర్స్‌ స్వాతిగా మొదలై స్వాతి అయింది. ఆ తర్వాత స్వాతిగాడు అయింది. నాకున్న నలుగురు స్నేహితుల్లో స్వాతి ఒకటి. ఈ చిత్రం తనకు సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆల్‌ ద బెస్ట్‌ స్వాతి అని సాయిధరమ్‌ తేజ్‌ అనగానే అతడిని హగ్‌ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది.

తదుపరి ఆమె మాట్లాడుతూ ‘‘మేం ఇద్దరం కలిసి బీఎస్సీ చదువుకున్నాం. సినిమాల్లోకి నేను ముందే వచ్చేశాను కాబట్టి తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరికీ ఒకే ఏజ్‌. ఎగ్జామ్స్‌లో నా పేపర్స్‌ కాపీ కొట్టి పాసయ్యాడు(నవ్వుతూ). ఇద్దరి పేర్లు ‘ఎస్‌’తో స్టార్ట్‌ అవుతాయి కాబట్టి ల్యాబ్‌ ప్రాక్టికల్స్‌లో కూడా మా సీటింగ్‌ వరుసగా వచ్చేది. అసలు నావల్లే ఎగ్జామ్స్‌ పాస్‌ అయ్యాడు(నవ్వుతూ). నిజం చెప్పాలంటే అడల్ట్‌ ఫ్రెండ్‌షిప్‌ కష్టం. కానీ తేజూ ఎప్పుడు నా వెనుక ఉన్నాడు.. నా జీవితంలో ఎప్పుడూ సపోర్ట్‌ సిస్టంలా ఉంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజు’ అని తేజుతో ఉన్న బాండింగ్‌ గురించి చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-09-26T17:59:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!