Telangana Elections: సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేస్తున్నారంటే..?
ABN, First Publish Date - 2023-11-29T17:06:58+05:30
తెలంగాణ వ్యాప్తంగా రేపు (నవంబర్ 30) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పలువురు సినిమా సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరెవరు.. ఎక్కడెక్కడ ఓటు వేయనున్నారంటే..
తెలంగాణ వ్యాప్తంగా రేపు(నవంబర్ 30) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Elections) సర్వం సిద్ధమైంది. ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పలువురు సినిమా సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరెవరు.. ఎక్కడెక్కడ ఓటు వేయనున్నారంటే..
ఓటువేసే సినీ ప్రముఖుల వివరాలు ఇవే...
జూబ్లీహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149): చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్
మణికొండ హైస్కూల్: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం
ఓబుల్‌రెడ్డి స్కూల్(పోలింగ్ బూత్ 150): జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 164): శ్రీకాంత్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ
ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్ బూత్ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్
ఎఫ్‌ఎన్‌సీసీ(పోలింగ్ బూత్ 160): విశ్వక్‌సేన్
జూబ్లీహిల్స్ (పోలింగ్ బూత్ 166): దగ్గుబాటి రానా, సురేశ్ బాబు
ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్ బూత్ 157): రవితేజ
బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ (పోలింగ్ బూత్ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్(పోలింగ్ బూత్ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్
రోడ్ నెం.45, జూబ్లీహిల్స్ – ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్
యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి
షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: ఎస్‌ఎస్. రాజమౌళి, రామా రాజమౌళి
శ్రీనగర్ కాలనీ MRO ఆఫీసు పోలింగ్ బూత్ నం 130: రామ్ పోతినేని
సికింద్రాబాద్, పద్మారావు నగర్‌లోని తుంగభద్ర మహిళా మండలి ఆఫీస్: శేఖర్ కమ్ముల
ఇవి కూడా చదవండి:
====================
*Vijayakanth: విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
*********************************
*Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..
***********************************
*విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో
*************************************