కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chudalani undi : చిరంజీవి డైలాగ్‌ లేకుండా 10 నిమిషాలా.. అయ్యేపనేనా..!?

ABN, First Publish Date - 2023-08-27T17:44:36+05:30

చిరంజీవి హీరోగా గుణశేఖర్‌ వహించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘చూడాలని ఉంది’. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. చిరుకు జోడీగా అంజలి ఝావేరితో పాటు, సౌందర్య నటించింది. ప్రకాశ్‌రాజ్‌ ప్రతినాయకుడిగా కనిపించారు. 1998 ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలైంది. నేటికి ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

చిరంజీవి(Chiranjeevi) హీరోగా గుణశేఖర్‌ (Gunasekhar) వహించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘చూడాలని ఉంది’ (Chudalani undi). అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. చిరుకు జోడీగా అంజలి ఝావేరితో పాటు, సౌందర్య నటించింది. ప్రకాశ్‌రాజ్‌ ప్రతినాయకుడిగా కనిపించారు. 1998 ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలైంది. నేటికి ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు చిరు ఫ్యాన్స్‌ను అలరించిన ఈ చిత్రంలో ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. (25 Years of Chudalani undi)

బాలలతో ‘రామాయణం’ తీస్తున్న సమయంలో తన తర్వాతి సినిమా కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఉండాలనే ఉద్దేశంతో ‘చూడాలని ఉంది’ కథ రాశారు గుణశేఖర్‌. అదే సమయంలో మధు సుంకర, అశ్వినీదత్‌లు గుణశేఖర్‌ దగ్గరకు వచ్చి, ‘చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నాం ఏదైనా కథ ఉంటే చెప్పండి’ అని అడగటంతో అప్పటికే తాను అనుకున్న కథను చిన్న లైన్‌గా చెప్పారు. స్ర్కిప్ట్‌ మొత్తం పూర్తి చేసిన తర్వాత కథ చెప్పమని అశ్వినీదత్‌ అడిగితే, ‘చిరంజీవిగారి ముందే మీకు చెబుతాను’ అని రెండు గంటలపాటు చిరంజీవి, అశ్వినీదత్‌, అల్లు అరవింద్‌లకు కథ వినిపించారు. కథ విన్న వెంటనే చిరు కూడా ఓకే అన్నారు. ఇలా ‘చూడాలని ఉంది’ పట్టాలెక్కింది.

ఈ చిత్రంలో చిరంజీవి అంజలా ఝావేరి మధ్య రైల్వేేస్టషన్‌లో ప్రేమ సన్నివేశాలు ఈసినిమాకు స్పెషల్‌. రైల్వే స్టేషన్‌లో చిరు - అంజలిల మధ్య డైలాగ్స్‌ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌ ఆ సన్నివేశాలను తెరకెక్కించారు గుణశేఖర్‌. ఆ సీన్‌ గురించి గుణశేఖర్‌ చెప్పుకొచ్చిన సంగతులు.. ‘‘రైల్వేస్టేషన్‌లో ఆ లవ్‌ సీన్‌ దాదాపు పది నిమిాషాలు ఉంటుంది. చిరంజీవికి అసలు డైలాగ్స్‌ ఉండవు. ఆయన స్టేషన్‌లో చైర్‌ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. చిరంజీవికి డైలాగ్‌ లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడపటం మామూలు విషయం కాదు. అలాంటిది దాదాపు పది నిమిషాలు షూట్‌ చేశాం. ఇది వర్కౌట్‌ అవుతుందా అని అశ్వనీదత్‌..షాక్ అయ్యారు. తర్వాత సినిమాకు ఇదే హైలెట్‌గా నిలిచింది. ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేేస్టషన్లు కావాలని నిర్మాత అశ్వనీదత్‌గారిని అడిగితే ఆయన షాకయ్యారు. ఎందుకంటే అప్పట్లో నాంపల్లి రైల్వే స్టేషన్‌ చాలా పెద్దది. రైళ్ల రాకపోకులు ఎక్కువ. జనాలతొ రద్దీగా ఉంటుంది. మూడు రోజులపాటు చిరంజీవిగారిని పెట్టుకుని షూట్‌ చేయడం చాలా కష్టం. పైగా ఆయనతో షూటింగ్‌ అంటే రైల్వేశాఖ కూడా అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్‌ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది. రైళ్లు ఆగిపోతాయి. టైమింగ్‌ మారిపోతుంది. ఇలా చాలా సమస్యలే ఉంటాయి. ఎంతోకష్టం మీద మాకు అనుమతి లభించింది. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా ేస్టషన్‌లోనే ఆగిపోయారు’’ అని గుణశేఖర్‌ చెప్పుకొచ్చారు.ట్రైన్‌ కదిలే సన్నివేశంలో వచ్చే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కు విపరీతమైన ఎంతగానో ఆకట్టుకుంది.

మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఎసెట్‌ అని చెప్పాలి. ఆయన చేసిన ప్రతి పాట శ్రోలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘రామా చిలకమ్మా’ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవికి ఇష్టంలేకపోయినా, ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యాన్ని కాదని, ఈ పాట ఉదిత్‌ నారాయణతో పాడించారు మణిశర్మ. తొలిసారి నలుగురు నాన్‌ తెలుగు సింగర్స్‌ ఉదిత్‌ నారాయణ, హరిహరన్‌, శంకర్‌ మహదేవన్‌, కవితా కృష్ఫమూర్తి పాడిన ఆల్బమ్‌ ఇది. అప్పట్లో చిరంజీవి పరిచయ సన్నివేశం పాట లేదా ఫైట్‌తో ఉండేది. పాట అయితే బ్రేక్‌ డ్యాన్స్‌ ఉండాల్సిందే. కానీ అందుకు భిన్నంగా క్లాసికల్‌గా ఉండే ‘యమహా నగరి’ పాటను పెడతామని గుణశేఖర్‌ సలహా ఇవ్వడంతో అందుకు చిరు, అశ్వనీదత్‌ ఇద్దరూ అంగీకరించారు. ఈ పాటకు వేటూరి నాలుగు చరణాలు ఇచ్చారు. కానీ ఫైనల్‌గా మూడ చరణాలే తీసుకున్నారు. పద్మావతి పాత్రధారి సౌందర్య వాసు ఘాటు ప్రేమ వివరించే ‘పదావతి పద్మావతి’ సన్నివేశం, ‘గుంటూరు బాంబు తీయ్‌’ అంటూ బ్రహ్మానందం చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. క్లైమాక్స్‌, ట్రక్‌ ఫైట్‌ సన్నివేశం ఓ ట్రెండ్‌ సృష్టించాయి.


హైలైట్స్ ...

పద్మావతి.. పద్మావతి డైలాగ్‌తో పాటు 'రామ్మా చిలకమ్మా'  పాట అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవికి ఇష్టంలేకపోయినా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని కాదని, ఈ పాట ఉదిత్‌ నారాయణతో పాడించారు మణిశర్మ.

మాస్టర్ సజ్జా తేజ  ఈ సినిమాతోనే ఎంట్రీ.. మూవీలో అతన్ని స్విమ్మింగ్ పూల్‌లోకి  విసిరేసే సీన్ చేయడానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకోలేదట. చిన్న పిల్లాడిని అలా విసరడం బాగోదని అనడంతో ఎలాగోలా ఒప్పించి చేయడంతో ఆ సీన్ బాగా క్లిక్ అయింది. 

ఈ సినిమా 63సెంటర్స్‌లో వందరోజులకు పైగానే కొనసాగింది. అప్పట్లో ఈమూవీ 20కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్‌ బద్దలుకొట్టింది

బాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన దివంగత సరోజా ఖాన్ కోసం ముంబయి వెళ్లగా చిరు సాంగ్‌కి కంపోజ్ అనగానే బిజీగా ఉన్నాసరే ఆమె ఒకే చేసింది. 'ఓ మారియా సాంగ్‌'కు గాను ఆమెకు నంది అవార్డు వరించింది.

ఈ సినిమాలో 'రామ్మా చిలకమ్మా' అనే పాట ఉదిత్ నారాయణ్‌కు తెలుగులో మొదటి పాట. ఆ పాట చాలా హిట్ అయ్యింది.

అల్లు అరవింద్‌- అశ్వినిదత్‌ కలిసి 'చూడాలని ఉంది' చిత్రాన్ని 'కోల్‌కతా మెయిల్‌' పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. అందులో హీరోగా అనిల​ కపూర్‌ నటించారు. ఈ సినిమాతో చేరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని అశ్వినిదత్‌ తెలిపారు.

చూడాలని ఉంది సినిమాకు రెండు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను దక్కించుకుంది.

Updated Date - 2023-08-27T17:57:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!