Rakesh Master: రాకేశ్ మాస్టర్ ఇకలేరు!
ABN, First Publish Date - 2023-06-18T18:20:31+05:30
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh master) కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్‌కు వెళ్లిన ఆయన ఇటీవల హైదరాబాద్ తిరిగివచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh master) కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్‌కు వెళ్లిన ఆయన ఇటీవల హైదరాబాద్ తిరిగివచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది(Rakesh master is no more). ఆదివారం సాయంత్రం సమయంలో రాకేశ్ మాస్టర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. (Rip Rakesh Master)
తిరుపతిలో జన్మించిన ఆయన ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పని చేసిన ఆయన కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించారు. టాలీవుడ్‌లో ఆయన 1500కు పైగా పాటలకు కొరియోగ్రఫీ అందించారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ ఇచ్చాడు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి హిట్ చిత్రాలకు రాకేశ్ కొరియోగ్రఫీ అందించారు. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్ వేదికగా అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ట్రెండ్ అయ్యారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.