Anil Ravipudi : ఆయన గట్స్‌కి హ్యాట్సాఫ్.. ఆ మోడ్‌లో ఉంటే ఆయన్ని ఆపలేం.
ABN, First Publish Date - 2023-10-14T20:50:49+05:30
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం 'భగవంత కేసరి’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ పెద్ది నిర్మించారు. కాజల్ కథానాయిక. శ్రీలీల కీలక పాత్రలో కనిపిస్తారు. అర్జున రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం 'భగవంత కేసరి’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ పెద్ది నిర్మించారు. కాజల్ కథానాయిక. శ్రీలీల కీలక పాత్రలో కనిపిస్తారు. అర్జున రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు.
భగవంత కేసరి’ మీ మార్కుకు భిన్నంగా కనిపిస్తుంది?
అవునండీ. నా చిత్రాల్లో ఇది కాస్త భిన్నమే. ఇప్పటికి ఒక ఓవర్ అయిపొయింది. ఇది మరో ఓవర్, మరో ఇన్నింగ్ అనుకుంటున్నాను. ఎమోషనల్ డ్రామాను ముందు చిత్రాల్లో కూడా బాగా పండించారు. అయితే ఎంటర్‌టైనమెంట్‌పై ఎక్కువ దృష్టితో ఎమోషన్సకి నెక్స్ట్ లెవల్ కి చేయలేదనే ఫీలింగ్ వుంది. కంప్లీట్ హానెస్ట్ ఇంటెన్స్ డ్రామా తో ఓ సినిమా చేయాలనిపించింది. దానికి బాలకృష్ణ గారి రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. ఆయనతోపాటు మంచి స్టార్ క్యాస్ట్, ప్రొడక్షన వాల్యూస్, కథ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ‘భగవంత్ కేసరి’ చాలా ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నా.
ఈ చిత్రంలో కూడా ఆర్మీ నేపథ్యం తీసుకోవడానికి కారణం?
‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్ బాబు గారితో ఒక ఆర్మీ కథ చేయాలని ఫిక్స్ అయి చేశాం. ‘్ఘ?భగవంత్ కేసరి’లో చాలా గోల్స్ వున్నాయి, ఆర్మీకి పంపడంతో పాటు అమ్మాయిని స్ట్రాంగ్ ఎలా చేయాలనే క్యారెక్టరైజేషన్ కూడా వుంటుంది. ఆ అమ్మాయికి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఎలా వీక్ అయ్యింది? ఎలా స్ట్రాంగ్ చేయాలి? అన్నది ఇతివృత్తం. దాని బ్యాక్ డ్రాప్ గోల్ ఆర్మీని తీసుకున్నాం. ‘అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి’ అనే అండర్ లైన్ బ్యూటీఫుల్ కంటెంట్ ఉంది. ఇప్పుడు అమ్మాయిలు ఆర్మీలో చేరుతున్నారు. పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో యుద్ధంలో కూడా పాల్గొంటారు. ఇందులో నేను తీసుకున్నది ఎవరూ టచ్ చేయని పాయింట్, కొంచెం స్ఫూర్తిని ఇచ్చేలా కూడా ఉంటుంది.
కథ విన్నాక బాలకృష్ణ రియాక్షన్ ఏంటి?
బాలకృష్ణ గారు కొత్త ఎలిమెంట్ వున్న కథలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రయోగం చేయడానికి ఆయన సై అంటారు. ‘అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి’ ఈ కాన్సెప్ట్ ఆయన చాలా బాగా నచ్చింది. చాలా బలంగా నమ్మారు. ఒక స్టార్ హీరోగా ఉండి శ్రీలీల లాంటి అప్ కమింగ్, ఫుల్‌ఫాంలో ఉన్న హీరోయిన్‌కు ఫాదర్‌గా చేయడానికి ఒప్పుకోవడం.. ఆయన గట్స్ నిజంగా హ్యాట్సాఫ్. ఆయన కథని బలంగా నమ్మారు. నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చారు. ఓ నటుడిగా సెట్‌లో ఆయన ఇచ్చిన సపోర్ట్, కంఫర్ట్ .. అవుట్ పుట్ చూేస్త మీకు అర్థమౌతుంది.
తెలంగాణ యాస ఆలోచన మీదేనా?
అవును. తెలంగాణ యాసలో ముక్కుసూటి తనం ఉంటుంది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం దానికి దగ్గరగా ఉంటుంది. ఇది ఆయన మీద చేేస్త బాగా వర్క్ అవుట్ అవుతుందని నమ్మాను, అది బాగా వర్క్ అవుట్ అయ్యింది కూడా. ఇందులో చాలా డైలాగ్స్ ఆయన నేచర్ కి దగ్గరగా వుంటాయి. ఆ డైలాగ్స్ థియేటర్‌లో దద్దరిల్లిపోతాయి.
'బ్రో ఐ డోంట్ కేర్’ టైటిల్ అనుకున్నారా?
అవును.. మొదట అనుకున్నాం. అయితే టైటిల్ అంటే ఒక ఫోర్స్ వుండాలి. బ్రో ఐ డోంట్ కేర్ కంటే ఏదైనా ఒక పేరు వుంటే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు ఇలా పేర్లు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ప్రేక్షకులతో సినిమా ట్రావెల్ అవుతుందని భగవంత్ కేసరి అని పెట్టాం. దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్‌బికేగా కాయిన్ చేయడంతో మరింత ఆకర్షణ వచ్చింది. ఇందులో ఎంటర్‌టైనమెంట్ సెటిల్‌గా ఉంటుంది. ట్రీట్‌మెంట్ కూడా చలాఆ సహజంగా ఉంటుంది. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా చేశాం. నా మార్క్ ఫ్ ఎలాగు ఉంటుంది. సహజంగా ప్రయత్నిస్తూనే వినోదాన్ని రాబట్టాం. ఇందులో కూడా చాలా మంచి వన్ లైనర్స్ వున్నాయి.
బాలకృష్ణ మిమ్మల్ని ఏమని పిలుస్తారు?
నన్ను బ్రో అంటారు. ఐతే షూటింగ్ స్పాట్‌లో గురువు గారు అని పిలుస్తారు. అంత పెద్ద లెజెండరీ యాక్టర్ గురువు గారు అని పిలవడంతో చాలా షాక్ అయ్యాను. దర్శకుడి స్థానానికి ఆయన ఇచ్చే గౌరవం అది. ఇక ఫన్ మోడ్‌లో వుంటే ఆయన్ని ఆపలేం.
అర్జున్ రామ్‌పాల్ గురించి...
ఇందులో విలన్‌ది చాలా పెద్ద రోల్. బాలకృష్ణ గారికి ఎదురుగా నిలబడే పాత్ర. అర్జున్ రాం పాల్ గారిని ుఓ శాంతి ఓం’లో చూసిననప్పటినుంచి ఇష్టం. ఆయన వాయిస్, ప్రజన్స్ చాలా బావుంటుంది. తెలుగులోకి తీసుకొస్తే బావుంటుందని ఆయన్ని కలిసి కథ చెప్పా. వెంటనే ఓకే అన్నారు. ఈ చిత్రానికి ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు.
వేరే ప్రపంచంలా...
ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇది వేరే ప్రపంచం అని ప్రేక్షకులకు అర్థమైపోతుంది. బాలకృష్ణ గారి ముందు సినిమాల రిఫరెన్స్‌లు ఇందులో ఉండవు. టైటిల్ పాత్రలో బాలకృష్ణ గారిని ఎంతో ఇష్టపడతారు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి భగవంత్ కేసరి నచ్చుతుంది. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రానికి కొనసాగింపు ఆలోచన లేదు. ప్రేక్షకుల రిసీవ్ చేసుకునే దానిని బట్టి పార్ట్ 2 గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ సినిమా విడుదలపైనే ఉంటుంది. ఆ తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. నెక్ట్స్ ఏం చేసినా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటా. దర్శకుడిగా అన్ని రకాల చిత్రాలు చేయాలనుకుంటా. కె విశ్వనాథ్ గారు లాంటి సినిమా చేయాలని ఉంది. అలాగే కంప్లీట్ లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేయాలని ఉంది. ఏదైనా ప్రేక్షకుల అభిరుచి మేరకే వెళ్తా.