సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

MegaStarChiranjeevi: అల్లుడిని గుర్తుపెట్టుకొని, అబ్బాయిని మర్చిపోయారు

ABN, First Publish Date - 2023-04-08T17:52:13+05:30

అల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు కానీ ఫోటో పెట్టలేదుట, అఖిల్ అక్కినేని కి కూడా విషెస్ చెప్పారు, కానీ మరి అబ్బాయికి విషెస్ చెప్పకపోతే ఎలా అని చిరంజీవిని అడుగుతున్నారు అభిమానులు

Chiranjeevi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ లో నటీనటులు పుట్టినరోజు వస్తోందంటే చాలు, సాంఘీక మాధ్యమాలు దద్దరిల్లాల్సిందే ! ఎందుకంటే తెలుగు నటులకు వుండే అభిమానులు ఆలా వుంటారు మరి, అందుకే అంత హంగామా. అయితే ఈ పుట్టినరోజులప్పుడే ఇంకో చిక్కు కూడా వుంది, అదేంటి అంటే, ఎవరు ఆ నటుడికి విషెస్ చెపుతున్నారు, ఎవరు చెప్పటం లేదు అని. ఒకవేళ చెపితే చిన్న న్యూస్, చెప్పకపోతే బ్రేకింగ్ న్యూస్ లా సాంఘీక మాధ్యమాల్లో అది కూడా వైరల్ అవుతుంది.

ఇప్పుడు అలాంటిదే ఒక వార్త వైరల్ అవుతోంది. ఈరోజు ఇద్దరు నటులు పుట్టినరోజులు ఒకటి అగ్ర నటుడు అల్లు అర్జున్ (Allu Arjun), రెండోది అఖిల్ అక్కినేని (Akhil Akkineni). అయితే ఈ ఇద్దరితో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకిరా నందన్ (Akira Nandan) పుట్టినరోజు #HBDAkiraNandan కూడా ఈరోజే. అగ్రనటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు అతని సినిమా 'పుష్ప 2' (Pushpa 2)టీజర్ లు, ఫోటో లుక్ లు, ఇంకా ఏవేవో అన్నీ విడుదల అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి, అందుకని అఖిల్ పుట్టినరోజు కొంచెం వెంకపడింది.

ఇదిలా ఉంటే మెగా స్టార్ చిరంజీవి అఖిల్ కి విషెస్ చెప్పారు, అలాగే మేనల్లుడు అయిన అల్లు అర్జున్ కి కూడా విషెస్ చెప్పారు. ఇంకో చిక్కు ఇక్కడ ఏంటి అంటే, చిరంజీవి (MegaStar Chiranjeevi), అల్లు అర్జున్ తో వున్న #HappyBirthdayAlluArjun ఫోటో షేర్ చెయ్యకుండా ఒక్క విషెస్ మాత్రమే చెప్పారట. అందుకని అభిమానులు ఒక ఫోటో షేర్ చేసి చెపితే ఏమవుతుంది అని అడుగుతున్నారు సాంఘీక మాధ్యమంలో. అభిమానులు కొట్టుకోవటమే కానీ, #HBDAkhilAkkineni అసలు చిరంజీవి సినిమాలు చెయ్యకపోతే మిగతా మెగా నటులు అనేవారు ఉండేవారు కాదు కదా ! అలాగే చిరంజీవి ముందు వీళ్ళందరూ పెరిగారు, అందుకని చిరంజీవి ఫోటో షేర్ చెయ్యాలా ఏంటి. విషెస్ చెప్పారు అదే గొప్ప. ఇంకా దానిమీద కోడిగుడ్డు మీద ఏవో పీకినట్టే కదా.

సరే అల్లు అర్జున్ తో పాటు అఖిల్ అక్కినేని #HappyBirthdayAkhilAkkineni కి కూడా పుట్టినరోజు విషెస్ చెప్పారు చిరంజీవి. బాగుంది. కానీ ఇంకొక అసలు వ్యక్తిని మర్చిపోయారు. అదే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ (AkiraNandan) కి విషెస్ చెప్పలేదుట చిరంజీవి. అది కూడా అభిమానులకి కోపం వచ్చింది. అఖిల్, అర్జున్ కి చెప్పి అకిర కి చెప్పకపోతే ఎలా? అని వాళ్ళు సాంఘీక మాధ్యమంలో అడుగుతున్నారు. ఇక్కడ పెట్టకపోతే చిరంజీవి మర్చిపోయినట్టేనా, ఫోన్ చేసి చెప్పరేమో కదా ! అయినా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎలా అయినా చెప్పుకుంటారు, మధ్యలో ఈ అభిమానులే చాలా ఫీల్ అయిపోతున్నారు !

Updated Date - 2023-04-08T17:52:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!