Chiranjeevi Tour: ఎంటర్‌టైన్‌మెంట్‌కి ముందు కాస్త సేద తీరడానికి..
ABN, First Publish Date - 2023-07-07T13:28:41+05:30
‘భోళా శంకర్ చిత్రం షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి విహారానికి వెళ్తున్నారు. నిరంతరం షూటింగ్, మెగా ప్రిన్సెస్ రాకతో ఆనందోత్సాహంలో ఉన్న ఆయన భార్య సురేఖతో కలిసి విహారానికి అమెరికా వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘భోళా శంకర్' (Bhola Shankar) చిత్రం షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విహారానికి వెళ్తున్నారు. నిరంతరం షూటింగ్, మెగా ప్రిన్సెస్ రాకతో ఆనందోత్సాహంలో ఉన్న ఆయన భార్య (Surekha) సురేఖతో కలిసి విహారానికి అమెరికా వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఫ్లైట్‌లో పయనమవుతున్న ఫొటోలను షేర్ చేశారు. ‘‘సురేఖతో చిన్న హాలీడే ట్రిప్ కోసం అమెరికా వెళ్తున్నా. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తదుపరి చేయబోయే హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూట్‌కి వెళ్లే ముందు కాస్త రిఫ్రెష్‌మెంట్ కోసం ఈ టూర్’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇలాంటి విహారం రిఫ్రెష్‌మెంట్ ఇవ్వడమే కాకుండా ఉత్తేజాన్ని నింపుతుంది అని అన్నారు.
ప్రస్తుతం ఆయన ‘భోళా శంకర్ షూటింగ్ పూర్తి చేశారు. గురువారంతో డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. మాస్ ఫైర్ ఎంటర్‌టైనర్ చూసేందుకు అంతా సిద్ధంకండి. డేట్ నోట్ చేసుకోండి’’ అని చిరంజీవి గురువారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే! మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాంబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.