సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mogilaiah Eye Surgery: మొగిలయ్యకు అండగా చిరంజీవి.. వీడియో వైరల్‌!

ABN, First Publish Date - 2023-04-18T14:32:27+05:30

సేవా కార్యక్రమాలు చేయడానికి, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. టాలీవుడ్‌ ఇండస్ర్టీలో, అభిమానులు కుటుంబాలకు ఎవరికి ఏ ఆపద వచ్చిన సహకరించడానికి ఆయన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సేవా కార్యక్రమాలు చేయడానికి, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) ఎప్పుడు ముందుంటారు. టాలీవుడ్‌ ఇండస్ర్టీలో, అభిమానులు కుటుంబాలకు ఎవరికి ఏ ఆపద వచ్చిన సహకరించడానికి ఆయన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. తాజాగా ఆయన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ‘బలగం’ మొగిలయ్యకు (Balagam Mogilaiah)సాయం అందించి (Mogilaiah Eye Surgery)గొప్ప మనసును చాటుకున్నాడు. వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమాలో.. ‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి’ పాటను పాడిన మొగిలయ్య కిడ్నీ, తదితర సమస్యలతో బాధపడుతున్నారు. డయాలసిస్‌కు కూడా ఆయన శరీరం సహకరించడం లేదు. ఈ సమస్యలతోనే సతమతమవుతున్న ఆయనకు ఇటీవల గుండె పోటు కూడా వచ్చింది. దాంతోపాటు కంటి చూపు కూడా దెబ్బతింది. మెరుగైన వైద్యం అందించాలని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు, హరీశ్‌రావు, యర్రబెల్లి దయాకరరావు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యానికి ఖర్చు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు తెలిపిన సంగతి విధితమే!

మొగిలయ్య దీన పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి (megastar Chiranjeevi) సాయం అందించడానికి ముందుకొచ్చారట. ఆయనకు కంటి చూపు మెరుగయ్యేలా వైద్యం చేయిస్తానని, అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని చిరు భరోసా ఇచ్చారట. ఈ మేరకు ‘బలగం’ దర్శకుడు వేణుకి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చిరంజీవి చెప్పారని ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-04-18T14:32:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!