సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiranjeevi: పాట కోసం కలుస్తున్నారు!

ABN, First Publish Date - 2023-04-21T20:46:25+05:30

వానొచ్చేనంటే వరదొస్తది... చిన్నగ.. చిన్నగ.. చిన్నగా... మది కన్నులు విప్పిన కన్నెగా... మన్మథ.. మన్మథ మామ పుత్రుడా... పాటలు వింటే చిరంజీవి -శ్రియా శరణ్‌ల కాంబినేషన్‌ గుర్తురాక మానదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వానొచ్చేనంటే వరదొస్తది...

చిన్నగ.. చిన్నగ.. చిన్నగా... మది కన్నులు విప్పిన కన్నెగా...

మన్మథ.. మన్మథ మామ పుత్రుడా...

పాటలు వింటే చిరంజీవి(Chiranjeevi) -శ్రియా శరణ్‌ల (Shriya saran) కాంబినేషన్‌ గుర్తురాక మానదు. ఠాగూర్‌’ (Tagore) చిత్రంలోని ఈ పాటలు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో తెలిసిందే! ఈ కాంబో మరోసారి వెండితెరపై సందడి చేయనుందని, ఆడిపాడి ఆలరించనున్నారని వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ (mehar ramesh) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్‌’. (Bhola shankar) తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘వేదాలం’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. శ్రియాతో కలిసి మరోసారి చిరు స్టెప్పులేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌లో టార్‌ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో ప్రత్యేక గీతం కోసం చిత్ర బృందం శ్రియను సంప్రదించారట. ఈ వార్త బయటికొచ్చినప్పటి నుంచీ వీరిద్దరి డ్యాన్స్‌ను మరోసారి తెరపై చూసేందుకు మెగా ఫ్యాన్స్‌ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా శ్రియ పలు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో అలరించిన విషయం తెలిసిందే! ‘భోళి శంకర్‌’ చిత్రాన్ని ఎ.కే ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. కీర్తి సురేశ్‌ చిరుకి సోదరిగా నటిస్తోంది. ఆగస్ట్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-04-21T20:46:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!