Odisha Train Accident : అభిమానులారా తక్షణమే రంగంలోకి దిగండి..!
ABN, First Publish Date - 2023-06-03T10:47:54+05:30
ఒడిశా (Balasore Train Accident) రైలు ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Reaction) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఒడిశా (Balasore Train Accident) రైలు ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Reaction) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే సహాయక చర్యలు అందించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. క్షతగాత్రులకు అవసరమైన రక్తం అందించడానికి అందుబాటులో ఉండాలని చిరు అభిమానులను కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన ఎంతో కలచివేసింది. బాధిత (Odisha Train Accident) కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలకు నష్టం జరిగింది. ఈ సమయంలో అక్కడ క్షతగాత్రులకు రక్తం అవసరం ఉంటుంది. సహాయక చర్యలకు అభిమానులు సిద్ధంగా ఉండాలి. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న అభిమానులు తక్షణమే రంగంలోకి దిగి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండి’’ అని ట్విట్టర్ చిరంజీవి పేర్కొన్నారు. (Koramandal Express)
ఈ ఘటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr Reaction) కూడా స్పందించారు. ‘‘కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ విధ్వంసకర ఘటన వల్ల ఎన్నో కుటుంబాల తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఇలాంటి కష్టకాలంలో వారందరికీ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు.